ప్రివ్యూ-మీ ఫోన్ అమ్మెయ్యడానికి షియోమీ తెచ్చిన అద్భుతమైన ఫీచర్ ఎంఐ రీ -సైకిల్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ షియోమీ...తన యూజర్లకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. miuiసెక్యూరిటీ యాప్ ద్వారా ఎంఐ రీ సైకిల్ ఫీచర్ ప్రారంభించడానికి క్యాఫిఫై సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. షియోమీ ఫోన్ యూజర్లు...తాము వాడుతున్న పాత స్మార్ట్ ఫోన్లను ఎంఐ హోం స్టోర్లలో బదిలీ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్ లైన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆఫ్ లైన్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదు. న్యూఢిల్లీలోని రీ కామర్స్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే మూడు కండిషన్స్ ద్వారా పాత ఫోనును కొనుగోలు చేస్తారు. ఫిజికల్ కండిషన్, హార్డ్ వేర్, పారామీటర్స్ ఈ మూడు తప్పనిసరిగా చెక్ చేస్తారు. అనంతరం మార్కెట్ విలువ ఆధారంగా ధరను అంచనా వేస్తారు. 
ఎంఐ రీసైకిల్ ఫీచర్ తో యూజర్లు పాత స్మార్ట్ ఫోన్లను అమ్మెయడానికి కొన్ని హార్డ్ వేర్ టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. మీ ఫోన్ను ఎంఐ సెక్యూరిటీ యాప్ ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. 
ఈ టెస్టులన్నీపూర్తయ్యాకే...ఫోన్స్ ధరను నిర్ణయిస్తారు. అయితే యూజర్లు నగదును డైరెక్ట్ గా చెల్లించే వీలుకాకున్న బ్యాంక్స్ ట్రాన్స్ ఫర్, పేటీఎం, వోచర్ల రూపంలోకూడా చెల్లించవచ్చు. క్యాషిఫై ప్రతినిధి ద్వారా యూజర్ ఆర్డర్ వివరాలను తెలసుకుని డివైజును సెలక్ట్ చేసుకుంటారు. పికప్ కోసం తేదీతోపాటు సమయాన్ని కూడా సెలక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. గతంలోనూ 2017లో షియోమీ క్యాషిఫై సంస్థతో ఒప్పందం చేసుకుంది. పాత పోన్లకు బదులుగా కొత్త షియోమీ మోడళ్లను అందించడం ద్వారా దేశీయ మార్కెట్లో తమ ఉనికి ని చాటుకునేందుకు షియోమీ ఆఫర్ ను ప్రకటించింది. విక్రయాల సంఖ్యను పెంచుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంది షియోమీ. 
 

ఎంఐ రీ -సైకిల్ షియోమీ క్యాషిఫై Mi Recycle Xiaomi Cashify