బ‌డ్జెట్ ధ‌ర‌లో 5జీ ఫోన్లు.. వ‌చ్చే ఏడాదికి సిద్ధం చేస్తామంటున్న క్వాల్‌‌కామ్‌

5జీ నెట్‌వ‌ర్క్ .. 4జీ కంటే ఎన్నో రెట్లు వేగ‌వంత‌మైన మొబైల్ క‌నెక్టివిటీ దీని సొంతం. అయితే 5జీ నెట్‌వ‌ర్క్‌ను వినియోగించుకోవాలంటే మాత్రం ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్ల‌తో ప‌నికాదు. అందుకోసం ప్ర‌త్యేకంగా 5జీ స్మార్ట్‌ఫోన్లు కావాలి. ఇప్ప‌టికే చాలా కంపెనీలు 5జీ మొబైల్స్‌ను రిలీజ్ చేశాయి. యాపిల్ కూడా 15వ తేదీ ఈవెంట్‌లో 5జీ అనేబుల్డ్ ఐఫోన్‌ను రిలీజ్ చేయ‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇవ‌న్నీ హైఎండ్ యూజ‌ర్ల‌కే ప‌రిమితం. మ‌రి కోట్లాది మంది మిడ్ బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌కు 5జీ అందే అవ‌కాశం లేదా? ఈ ప్ర‌శ్న‌కు ఉంద‌ని స‌మాధాన‌మిస్తోంది చిప్‌సెట్ త‌యారీ సంస్థ క్వాల్‌కామ్.  

2021 క‌ల్లా సిద్ధం
బ‌డ్జెట్ ధ‌ర‌లో 5జీ స్మార్ట్‌ఫోన్లు తెస్తామ‌ని క్వాల్‌కామ్ ప్ర‌క‌టించింది. 2021 క‌ల్లా వీటిని లాంచ్ చేస్తామ‌ని, ధ‌ర కూడా 200 డాల‌ర్లు (అంటే 14వేల వ‌రకు) లోపే ఉండొచ్చ‌ని చెబుతోంది.   5జీ నెట్‌వ‌ర్క్ ఇప్ప‌టికే 35 దేశాల్లో లాంచ్ అయింది.  కాబట్టి మిడ్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి క్వాల్‌కామ్ ఈ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 400 సిరీస్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్లు రానున్నాయి.

మ‌న మాటేంటి? 
ఇండియాలో 5జీ ఇప్పుడ‌ప్పుడే వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే 5జీ స్పెక్ట్ర‌మ్ వేలమే ఇంకా పూర్తికాలేదు. 2022 నాటికి గానీ ఈ త‌తంగ‌మంతా పూర్త‌యి 5జీ అందుబాటులోకి రాద‌ని టెక్నాల‌జీ వ‌ర్గాల అంచ‌నా. నెట్‌వ‌ర్కే లేన‌ప్పుడు 5జీ ఫోన్లు వ‌చ్చి ఉప‌యోగం లేదు కాబ‌ట్టి ఇండియాలో 5జీ ఫోన్ల అవ‌స‌రం అప్పుడే రాక‌పోవ‌చ్చు. 

 

5జీ స్మార్ట్‌ఫోన్లు ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్లు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 400 5జీ స్మార్ట్‌ఫోన్లు Entry level 5G smartphones 5G smartphones