మ‌న‌ సొంత సోష‌ల్ మీడియా యాప్‌.. ఎలిమెంట్స్ వ‌చ్చేసింది

ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, వాట్సాప్ అన్నీ సోష‌ల్ మీడియా యాప్‌లే. కానీ ఇందులో ఇండియ‌న్ మేడ్ ఒక్క‌టీ లేదు.  అన్నింటికీ ఆధార‌ప‌డిన‌ట్టే ఆఖ‌రికి యాప్స్‌కి కూడా విదేశాల మీదే ఆధార‌ప‌డాలా? ఇక ఎంత మాత్రం అక్క‌ర్లేదు.  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎలిమెంట్స్ పేరుతో  పూర్తి స్వ‌దేశీ సోష‌ల్ మీడియా యాప్‌ను తీసుకొచ్చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది కేవలం సోష‌ల్ మీడియా యాప్ మాత్ర‌మే కాదు.. అంత‌కు మించి.

లాంచ్ చేసిన ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు
ఉప‌రాష్ట్రప‌తి ఎం.వెంక‌య్య‌నాయుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ కలిసి ఈ యాప్‌ను ఈరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు లాంచ్ చేశారు. మేకిన్ ఇండియా అని అంద‌రూ కోరుకుంటున్న ఈ సంద‌ర్భంలో మ‌న దేశీయ యాప్‌ను తయారుచేసుకోవ‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ యాప్‌ను 1000 మంది  ఐటీ ప్రొఫెష‌నల్స్ క‌లిసి త‌యారుచేశారు. 

వ‌న్‌స్టాప్ యాప్ 
ఎలిమెంట్స్ యాప్ వాస్త‌వానికి సోష‌ల్ మీడియా యాప్ మాత్ర‌మే కాదు. ఇదొక వ‌న్‌స్టాప్ యాప్ అని చెప్పొచ్చు.  దీనిలో మెసేజింగ్ నుంచి ఈకామ‌ర్స్ వ‌ర‌కు అన్ని ర‌కాల ప‌నులూ చ‌క్క‌పెట్టుకోవ‌చ్చు. 

ఇవీ ఫీచ‌ర్లు
* ఆడియో, వీడియో కాన్ఫ‌రెన్స్ కాల్స్‌, గ్రూప్ కాల్స్‌
* ఎలిమెంట్స్ పేతో  పూర్తి సుర‌క్షిత‌మైన పేమెంట్స్‌
* ఫేస్‌బుక్ మాదిరిగా ప‌బ్లిక్ ప్రొఫైల్ 
* భార‌తీయ వ‌స్తువుల‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి ప్ర‌త్యేక‌మైన ఈకామ‌ర్స్ ఫ్లాట్‌ఫాం

  8 భాష‌ల స‌పోర్ట్‌
పూర్తి దేశీయ యాప్ అయిన ఎలిమెంట్స్ 8 ప్రాంతీయ భాష‌ల్లో ప‌ని చేస్తుంది.  ప్రాంతీయ భాష‌ల‌కు కూడా వాయిస్ క‌మాండ్ ప‌ని చేయ‌డం దీనిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇప్ప‌టికే దీన్ని ల‌క్ష మంది డౌన్‌లోడ్  చేసుకున్నారని ఆర్ట్ ఆఫ్‌లివింగ్ ఫౌండేష‌న్ ప్ర‌క‌టించింది. 

ఎలిమెంట్స్‌ ఇండియ‌న్ సోష‌ల్ మీడియా యాప్‌ elyments app Indian Social media app One stop app Â