రివ్యూ - అడోబ్ ఫొటోషాప్ కెమెరా యాప్ గురించి మీకు తెలుసా!

అడోబ్ ఫొటోషాప్.. ఇది చాలా ప్ర‌ముఖంగా ఉప‌యోగించే సాఫ్ట్‌వేర్‌. మ‌న ఫొటోల‌ను ర‌క‌ర‌కాలుగా ఉప‌యోగించడం కోసం... వాటిలో మార్పు చేర్పులు చేయ‌డం కోసం అడోబ్ ఫొటోషాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  కాలానుగుణంగా ఈ సాఫ్ట్‌వేర్‌లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. మ‌రి అలా వ‌చ్చిన వాటిలో అడోబ్ ఫొటోషాప్ కెమెరా యాప్ ఒక‌టి. మ‌రి ఏంటి ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌? ...దీనిలో ఉండే ఫిల్ట‌ర్ మ్యాజిక్ ఏమంటో తెలుసుకుందాం..

లెన్సెస్‌
ఫొటోల‌ను భిన్నంగా చూడాలి... వాటిలో మార్పు చేర్పులు చేయాల‌ని అనుకునేవాళ్ల‌కి అడోబ్ ఫొటోషాప్ కెమెరా యాప్ మంచి ప్ర‌త్యామ్నాయం. ఈ యాప్ ఇంకా అధికారికంగా విడుద‌ల కాక‌పోయినా ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌లో ప్రివ్యూ రూపంలో ఇది అందుబాటులో ఉంది. దీనిలో ఫొటో ఎఫెక్ట్స్‌, ఫిల్ట‌ర్ ఫ్యామిలీ లాంటి ఆప్ష‌న్లు ఉన్నాయి. అడోబ్ ఫిల్ట‌ర్స్‌ని లెన్సెస్ పేరుతో తీసుకొస్తోంది. దీనిలో ఉండే ఏఐ ప‌వ‌ర్డ్ మొబైల్ కెమెరా యాప్ అద్భుత‌మైన ఫొటో మ్యాజిక్‌ను అందిస్తుంది. దీనిలో డ‌జ‌న్ల కొద్దీ ఫిల్ట‌ర్లు, ఎఫెక్ట్స్ ఉన్నాయి. దీని క్వాలిటీ లెవెల్ కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది. 22 సెట్ల లెన్సెస్ ఇందులో ఉన్నాయి.

ఫంకీ టెక్ట్ బాక్సెస్‌
భిన్న‌మైన లెన్సెస్‌ను యూజ్ చేసుకుని ఫొటోల‌ను మీకు న‌చ్చిన విధంగా తీర్చిదిద్దుకోవ‌చ్చు. వీటికి ఫంకీ టెక్ట్ బాక్స్‌లు, గ్రాఫిక్స్ ఎఫెక్ట్‌లు మ‌రింత అందాన్ని తెచ్చిపెడ‌తాయి. ఈ ఫొటోల‌కు డ‌బుల్ ఎక్స్‌పోజ‌ర్‌, స్టూడియో లైటింగ్ కూడా ఈ ఫిల్ట‌ర్లు, లెన్సులు అందిస్తాయి.  వేరే యాప్‌లు కూడా ఫిల్ట‌ర్లు, లెన్సులు అందిస్తున్నా అడోబో అందిస్తున్న లెన్స్‌లు, ఫిల్ట‌ర్లు మాత్రం చాలా భిన్నం. ఒరిజిన‌ల్ పిక్చ‌ర్ ఏమాత్రం చెడ‌కుండా మ‌రింత అందంగా త‌యారు చేయ‌డం వీటి స్పెష‌ల్‌.  దీనిలో ఉండే నైట్ షిఫ్ట్ ఫిల్ట‌ర్‌.. రాత్రి వేళ దిగే ఫొటోల అందాన్ని మ‌రింత పెంచేలా ఉంటుంది. దీనిలోనే మీరు కాంట్రాస్ట్‌, షాబో, సాట‌రేష‌న్ లాంటి ఆప్ష‌న్లు కూడా పొందొచ్చు.  

Adobes PhotoShop Camera App Pure Filter Magic