ఫేస్‌బుక్ న్యూస్ పబ్లిష్ చేస్తే ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు !

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ దిశగా న్యూస్ అప్‌డేట్స్ అందించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఫేస్‌బుక్ యాప్‌లో న్యూస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి.ఇందుకోసం మిలియన్ల డాలర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. పబ్లిషర్లకు తమ మెటేరియల్స్ ను పబ్లిష్ చేసే అధికారం ఇస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.కాగా దీనిపై ఫేస్‌బుక్ సుధీర్ఘంగా చర్చలు జరుపుతోంది. ఎన్నో యేళ్లుగా ఆన్ లైన్ ప్రకటనల గుత్తాధిపత్యంపై పోరాడుతున్న వార్తా పరిశ్రమను దెబ్బ తీస్తుందనే విమర్శలు వస్తున్న తరుణంలో ఫేస్ బుక్ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

లైసెన్స్‌ కలిగిన స్టోరీలు, హెడ్ లైన్స్ సహా ఇతర మెటేరియల్స్ పబ్లిష్ చేసినందుకు ఏడాదికి 3 మిలియన్ల డాలర్లు సుమారు (రూ.21.15కోట్లు) చెల్లించినట్టు ఫేసుబుక్ ప్రతినిధులు న్యూస్ ఎగ్జిక్యూటివ్‌లకు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే దీనిపై స్పందించడానికి నిరాకరించిన ఫేస్‌బుక్. News Tabను లాంచ్ చేసే పనిలో ఉన్నట్టు మాత్రం ధృవీకరించింది. 

ఇప్పటికే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ న్యూస్ ఫీచర్‌ కు సంబంధించిన వివరాలను ప్రకటించారు. అయితే ఫేస్‌బుక్  వేర్వేరుగా 3 మిలియన్ల డాలర్లు ఆఫర్ చేస్తుందా లేదా మొత్తం అన్ని వార్తా సంస్థలకు కలిపి ఇస్తుందా అనేది జర్నల్ నివేదిక స్పష్టం చేయలేదు. ఇదిలా ఉంటే వార్తా పరిశ్రమలో ఎంతో మంది తమ కంటెంట్‌ను ఉచితంగా వాడుకుంటున్నాయని ఫేస్ బుక్, గూగుల్ సంస్థలను నిందిస్తున్నారు.

దానికి అవసరమైన లైసెన్సులు కూడా తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుందనే టాక్ నడుస్తోంది. ఎప్పటకప్పుడు వార్తలను అప్‌డేట్ చేసేందుకు అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థలతో టైఅప్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంవత్సరం ప్యాకేజీగా మాట్లాడుకుని న్యూస్ ఫీచర్‌ను అద్భుతంగా అందించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా న్యూస్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. 

న్యూస్ టెక్నాలజీ ఫేస్‌బుక్ సోషల్ మీడియా పబ్లిష్ న్యూస్