జియోమిలో కస్టమ్ ఆండ్రాయిడ్ ఫోన్లంటిలో దాదాపు ఎంఐయూఐ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. ప్రతి మోడిఫికేషన్లోనూ ఇది తన ఫీచర్లను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆప్షన్ ఉంది.. దీనిలో ఉన్న ప్రధానమైన ఉపయోగం ఏమిటంటే ఒక ఆండ్రాయిడ్ డివైజ్‌ను ఒకేసారి ఎక్కువమంది యూజర్లు ఉపయోగించడం. యాప్ డేటా.. ఫైల్స్ షేర్ చేయకుండానే ఇద్దరు ప్రత్యేమైన స్పేస్‌తో ఫోన్‌ను యూజ్ చేసుకోవడమే ఈ ఫీచర్ ప్రత్యేకత. కానీ ఎంఐయూఐలో కూడా ఇలాంటి ఆప్షన్ ఉంది. దీన్నే సెకండ్ స్పేస్ అంటారు. లాలిపాప్ మాదిరిగానే ఇది కూడా ఒకేసారి మల్టిపుల్ యూజర్లు ఒకే ఫోన్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఏంటి సెకండ్ స్పేస్
ఎంఐయూఐ రన్నింగ్ అయ్యే ఏ ఫోన్లో అయినా ఈ ఆప్షన్ ఉంటుంది. అంటే ఈ ఫోన్ ఓవర్ ఫస్ట్ స్పేస్‌ని వాడుకుంటారు. సెకండ్ స్పేస్ అంటే మీ ఫోన్లోనే మన ఫోన్‌కు చోటివ్వడం లాంటిది. మీ డేటాను ఏం డిస్టర్బ్ చేయకుండా మీ డేటాను ఇంపోర్ట్ చేయకుండా... ఫోన్‌ను యూజ్ చేసుకోవడమే ఈ సెకండ్ స్పేస్ స్పెషాలిటీ. అంటే ఒక కొత్త ఫోన్ బాక్స్ నుంచి ఓపెన్ చేసి వాడుకుంటే ఎలా ఉంటుందో ఈ సెకండ్ స్పేస్ కూడా అలాగే ఉంటుంది. దీనిలో ప్రి ఇన్స్టాల్డ్ యాప్స్ ఉండడం మరో ప్రత్యేకత.
ఏంటి దీనితో లాభం
సెకండ్ స్పేస్‌ను యూజ్ చేస్తున్న వాళ్లు కొత్త యాప్‌లు యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వాల్ పేపర్స్ పెట్టుకోవచ్చు. డిఫెరెంట్ లాంఛర్ వాడుకోవచ్చు. అంతేకాదు ప్రత్యేకమైన అన్‌లాక్ మోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకే ఫోన్‌ను ఇద్దరు యూజర్లు ప్రైవసీతో వాడుకోవచ్చన్న మాట. ఎంఐయూఐ 8 ఉన్న అన్ని జియోమి ఫోన్లలో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. జియోమి స్టాక్ ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ వన్ ఫోన్లలో మాత్రం ఈ ఆప్షన్ లేదు. దీనిలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ స్పేస్‌లో ఉన్న మెమరీని కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే 4 జీబీ స్టోరేజ్ ఉంటే.. రెండు స్పేస్‌లకు సమానంగా స్టోరేజ్ వస్తుంది.
Second Space MIUI definitive Guide Xiaomi