ఏమిటీ రివర్స్ ఇమేజ్.. ఏ టూ జెడ్ గైడ్

మనం ఇంటర్నెట్ లో ఫొటోలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక సందేహం వచ్చిందా? మనం చూస్తున్న ఫొటో నిజమైనదేనా అనే అనుమానం కలిగిందా.. ఎందుకంటే ఆ ఫొటో సోషల్ మీడియాలోంచి తీసుకున్నదా లేదా డేటింగ్ సైట్లలోదా లేదా ఏదైనా న్యూస్ స్టోరీదా అనే డౌట్ వచ్చిందా.. మనం చూస్తున్న ఫొటో నిజమైందా కదా అని తెలుసుకోవాలని ఉందా? మరి ఎలా తెలుసుకోవడం?

గూగుల్ ఇమేజస్

ఆన్ లైన్లో ఇమేజ్ లను సెర్చ్ చేయడానికి ప్రధానంగా ఉపయోగించే వనరు గూగుల్ ఇమేజెస్. గూగుల్ ఇమేజస్ మనకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ను అందిస్తుంది. బింగ్, యండెక్స్ కూడా ఇదే ఆప్షన్ ను ఆఫర్ చేస్తున్నాయి. మనం ఏదైనా ఇమేజ్ వెతికినప్పుడు ఆ ఇమేజ్ ఇంతకుముందు చూసినట్లు అనిపించిందా? అలాంటప్పుడు గూగుల్ ఇమేజెస్ కి వెళ్లి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయాలి. మీరు చూసిన ఫొటో యూఆర్ఎల్ ని అక్కడ పేస్ట్ చేయాలి. లేకపోతే ఆ ఫొటోను నేరుగా అప్లోడ్ చేయాలి. వెంటనే గూగుల్ ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చిందో మూలం ఎక్కడిదో మనకు చెప్పేస్తుంది. 

టిన్ ఐ
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడానికి టిన్ ఐ టూల్ బాగా యూజ్ అవుతుంది. మీకు అనుమానం కలిగిన ఫొటోలను టిన్ ఐకి ఇస్తే చాలు ఇదే స్కాన్ చేసుకుని ఈ ఫొటోకు సంబంధించి అలెర్టులను ఎప్పటికప్పుడు మీకు అందజేస్తుంది. అయితే గూగుల్ సెర్చ్ కి ఉన్నంత ఆక్యురెసీ దీనికి లేదు. జనరల్ ఇమేజెస్ మీదే ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఫొటోగ్రఫీ, డిజైన్స్ లాంటి ఇమేజ్ లను ఇది వెతికి పెడుతుంది. మీ ఇమేజ్ లను ఎవరూ కాపీ కొట్టకూడదని భావిస్తే టిన్ ఐ ద్వారా వెతికి పట్టుకోవడం మంచి ఆప్షన్.

Reverse Image Search Use Tin Eye google