గూగుల్ ఫొటోస్‌ని ఇంకో అకౌంటింగ్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి సింపుల్ గైడ్!

ఫొటోల‌ను దాచుకోవ‌డానికి గూగుల్ ఫొటోస్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు సంబంధించిన అన్ని సంద‌ర్భాల ఫోటోలను 
గూగుల్ దాచి పెడుతుంది. ఫ‌లానా తేదీ నాటి ఫొటోల‌ను మ‌ళ్లీ మ‌న‌కు పంపిస్తుంది. అయితే గూగుల్ ఫొటోస్‌లో ఎన్నో వేల ఫొటోలు ఉంటాయి. వీటిలో మ‌న‌కు కొన్ని ఫొటోలు మ‌న‌కు కావాలంటే ఏం చేయాలి?  గూగుల్ ఫొటోస్‌లో ఉన్న ఫొటోల‌ను మ‌రో అకౌంట్‌కు ట్రాన్స‌ఫ‌ర్ చేయాలంటే ఎలా?

ఎక్కువ ఫొటోలు ఉంటే..
సాధార‌ణంగా గూగుల్ ఫొటోస్‌ల ఉండే ఫొటోల‌ను డౌన్‌లోడ్ చేయ‌డం ద్వారా ఇంకో అకౌంట్‌కు లేదా వాట్స‌ప్ ద్వారా ట్రాన్స‌ఫ‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే ఒక‌సారి ఎక్కువ ఫొటోలు డౌన్‌లోడ్ చేసి పంపాలంటే మాత్రం క‌చ్చితంగా ఒక ఆప్ష‌న్ కావాలి. అదే ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డం. ఇలా ఫొటోల‌ను ఒక సిస్ట‌మ్ నుంచి ఇంకో సిస్ట‌మ్‌కో లేదా అకౌంట్‌కో ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలంటే దానికి ఒక మార్గం ఉంది.

ఏం చేయాలంటే..
గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఇందుకోసం లెఫ్ట్‌కార్న‌ర్‌లోని హామ్‌బర్గ‌ర్ మెనూ ఓపెన్ చేసి వెళ్లాలి. ఆ త‌ర్వాత షేర్డ్ లైబ్రేరీస్ మీద క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ కొట్టాలి. ఆ త‌ర్వాత ఈమెయిల్ అడ్రెస్ ఎంట‌ర్ చేయాల్సిందిగా మీకో డైలాగ్ బాక్స్ వ‌స్తుంది.  అంటే మీరు ఎవ‌రికి ఫొటోలు పంపాలో ఆ మెయిల్ అడ్రెస్ యాడ్ చేయాలి. ఈ మెయిల్ అడ్రెస్ ఎంట‌ర్ చేశాక‌... ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేయాలి.  మీకు ఎవ‌రైనా పంపాలంటే  ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలంటే సెండ్ ఇన్విటేష‌న్ మీద క్లిక్ చేసి ఫొటోస్ యాప్ ఓపెన్ చేసి షేరింగ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి సెండ్ ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేయాలి. 

simple steps transfer Google Photos anoher account