డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి.. అందుకే ఈ కంప్లీట్ గైడ్ మీకోసం

ఫాస్టాగ్.. ఎక్క‌డా చూసినా ఈ పేరు మార్మోగుతోంది.  మ‌న ప్ర‌యాణాన్ని మ‌రింత సుల‌భత‌రం చేసేందుకు ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త ప‌థ‌క‌మే ఫాస్టాగ్. ఫోర్  వీల‌ర్స్ అంత‌కంటే ఎక్కువ వాహ‌నాలు జర్నీ చేస్తున్న‌ప్పుడు క‌చ్చితంగా టోల్ ఫీజు క‌ట్టాల్సి ఉంటుంది.  ఇందుకోసం టోల్ గేట్స్ ద‌గ్గ‌ర బండ్లు ఆగితే చాలా స‌మ‌యం వృథా అవుతుంది. దీనికి ప‌రిష్కారంగానే ఫాస్టాగ్ వ‌చ్చింది. మ‌రి ఏంటి ఫాస్టాగ్‌.. దీని ప్ర‌త్యేక‌త‌లేంటి?

డిసెంబ‌ర్ 1 నుంచి త‌ప్ప‌నిస‌రి..
డిసెంబ‌ర్ 1 నుంచి అన్ని పెద్ద వాహ‌నాలు కంప‌ల్స‌రీగా ఫాస్టాగ్ అవ‌స‌రం.  ఫాస్టాగ్ అంటే ఇదో ప్రిపెయిడ్ రీఛార్జ్‌బుల్ ట్యాగ్‌. దీన్ని మ‌న  దీన్ని మ‌న వాహ‌నం మీద ఉంచుకుని రీఛార్జ్ చేసుకుంటే చాలు. మ‌న వాహనం మీద ఫాస్ట్ టాగ్ స్టిక్క‌ర్‌ను  టోల్  సిబ్బంది స్కాన్ చేస్తారు. మ‌న అకౌంట్లో మ‌న వెంట‌నే క‌ట్ అయిపోతుంది. దీని వ‌ల్ల స‌మ‌యం వృథా కాదు. మ‌నం వెంట‌నే టోల్ గేట్ నుంచి వెళ్లి పోవ‌చ్చు. ఇంత వేగంగా పూర్త‌య్యే ప్రక్రియ కాబ‌ట్టే ప్ర‌తి ఒక్క‌రూ ఫాస్ట్‌గా వేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఇందుకు డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. ఆ త‌ర్వాత ఎవ‌రి ఫాస్ట్‌గ్ వేసుకోక‌పోయినా రెండు రెట్లు టోల్ ఫీజులు క‌ట్టాల్సి ఉంటుంది. 

ఎక్క‌డ దొరుకుతాయి... ఎలా కొనాలి
ఫాస్టాగ్ స్టిక్క‌ర్లు ఎక్క‌డ దొరుకుతాయి? .. వీటిని ఎలా కొనాలి చాలామందికి ఇదే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. అయితే ఇవి లభించే ఫ్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. అందులో ఇ-కామర్స్ సైట్ అమెజాన్ ఒక‌టి. ఈ ట్యాగ్ బ్యాంక్‌తో క‌నెక్ట్ అయి ఉంటుంది. దీన్ని కొన్ని త‌ర్వాత మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్లో మై ఫాస్టాగ్ యాప్ వేసుకోవాలి. మీ వెహిక‌ల్ డిటైల్స్ ఎంట‌ర్ చేసి ఎంత రీఛార్జ్ చేయాల‌నుకుంటే అంత చేసుకోవచ్చు. పేటీఎం కూడా ఫాస్టాగ్ సేవ‌లు అందిస్తోంది. క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు కూడా ప్ర‌క‌టించింది. 

FASTag mandatory December 1 amazon paytm