మీ ఇమేజ్‌లో ఆకాశాన్ని కావాల్సిన‌ట్లు మార్చుకోవ‌డానికి ఫోటోషాప్

ఫోటోషాప్‌లో ఇమేజ్‌ను కావాల్సిన‌ట్లు మార్చేసుకోవ‌చ్చు. బ్యాక్‌గ్రౌండ్‌, క‌ల‌ర్ ఇలా అన్నీ మార్చుకోవ‌డానికి చాలా ఫీచ‌ర్లున్నాయి. అయితే ఎక్స్‌ప‌ర్ట్‌లే చేయ‌గ‌లుగుతారు. సాధార‌ణ యూజ‌ర్లు కూడా చేయ‌గ‌లిగేలా అడోబ్ ఫోటోషాప్ కొత్త ఫీచ‌ర్లు తీసుకొస్తోంది. అందులో ముఖ్య‌మైంది ఇమేజ్ స్కై చేంజింగ్‌.

ఏమిటిది?

మీ ఫోటోలో ఆకాశం ఏ రంగులో ఉన్నా దాన్ని మీకు కావాల్సిన ఎఫెక్ట్‌లోకి ఈజీగా మార్చేసుకోవ‌చ్చు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌తో ప‌నిచేసే ఫోటోషాప్ స్కై రీప్లేస్‌మెంట్ టూల్‌ను త్వ‌ర‌లో తీసుకొస్తోంది. వ‌చ్చే నెల‌లోనే ఈ టూల్ ఫోటోషాప్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రావ‌చ్చు.

ఫీచ‌ర్లు

బ్లూ స్కైస్‌, స్పెక్టాక్యుల‌ర్‌, స‌న్‌సెట్స్ ఇలా చాలా ఫీచ‌ర్లు ఉన్నాయి. వీటితో మీ ఫోటోలోని ఆకాశాన్ని ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు. కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ కూడా ఈజీగా ఎడ్జ‌స్ట్ చేసుకోవ‌చ్చు. ఈ టూల్ అందుబాటులోకి వ‌స్తే మీరు కూడా ఫోటోషాప్ ఎక్స్‌ప‌ర్ట్ అయిపోవ‌చ్చు.

 

ఫోటోషాప్ కొత్త ఫీచ‌ర్‌ ఫోటోషాప్ స్కై రీప్లేస్‌మెంట్ టూల్‌ Adobe Photoshop featurtes Adobe Photoshop tools Adobe Photoshop Sky Repalcement tool