మెసేజింగ్ సర్వీస్‌గా ప్రపంచవ్యాప్తంగా పాపులరయిన వాట్సాప్ ఇప్పుడు పేమెంట్ ఆప్షన్‌ను కూడా ప్రారంభించింది. రెండేళ్ల కిందటే దీన్ని ప్రారంభించినా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతి తాజాగా లభించింది. దీంతో 2 కోట్ల మంది యూజర్లతో పేమెంట్ ఆప్షన్‌ను ప్రారంబించబోతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్‌లో పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం.
వాట్సాప్ పేమెంట్ సెట్ చేయడం ఎలా?
* వాట్సాప్ ఓపెన్ చేయండి.
* త్రీ డాట్స్ మెనూలోకి వెళ్లి పేమెంట్స్‌ను క్లిక్ చేయండి.
* యాడ్ న్యూ పేమెంట్ మెథడ్‌ను సెలెక్ట్ చేయండి.
* యాక్సెప్ట్ అండ్ కంటిన్యూను సెలెక్ట్ చేయండి.
* ఇప్పుడు వచ్చే లిస్ట్‌లో నుంచి మీకు ఖాతా ఉన్న బ్యాంక్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్‌కు యూపీఐ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.
* ఇప్పుడు మీ ఫోన్ నెంబర్‌ను సెలెక్ట్ చేయండి. మీ వాట్సాప్ ఫోన్ నెంబర్ మీరు బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఒకటే అయి ఉండాలి.
* వెరిఫై ఎస్ఎంఎస్ను క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ అథెంటికేట్ అవుతుంది.
* ఇప్పడు హిట్ బటన్ నొక్కితే మీ సిమ్ కార్డ్‌ను వాట్సాప్ అథెంటికేగట్ చేస్తుంది.
* అలౌ బటన్‌ను క్లిక్ చేస్తే వాట్సాప్ పేమెంట్స్ మెసేజ్‌లు మీ మొబైల్ నెంబర్‌కు వస్తాయి.
* డన్ బటన్ నొక్కితే వాట్సాప్ పేమెంట్ సెటప్ అవుతుంది.
వాట్సాప్ ద్వారా మనీ సెండ్ చేయడం రిసీవ్ చేసుకోవడం ఎలా?
వాట్సాప్ పేమెంట్ పూర్తయ్యాక మీరు పేమెంట్స్చేయడం చాట్ చేసినంత సులువు.
* మీ చాట్ విండోలోనే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.
* పేమంట్స్ బటన్‌ను క్లిక్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరికి డబ్బులు పంపాలో సెలక్ట్ చేయండి.
* ఎంత అమౌంట్ సెండ్ చేయాలో ఎంటర్ చేయండి. ఏదైనా నోట్ రాయాలన్నా రాయొచ్చు.
* ఇప్పుడు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి.
* అంతే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మనీ మీ కాంటాక్ట్‌కు సెండ్ అవుతుంది.
వాటà±à°¸à°¾à°ªà± పేమెంటà±à°¸à±â€Œ వాటà±à°¸à°¾à°ªà± పేమెంటà±à°¸à± గైడà±â€Œ Whatsapp payment Whatsapp payment guide