లాక్డౌన్లో ఇండియాలో అత్యంత పాపులర్ అయిన యాప్స్‌లో జూమ్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆన్లైన్ క్లాస్‌లు, ఆన్లైన్ మీటింగ్స్‌కి ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని స్మార్ట్ ఫోన్లో కూడా ఈజీగా యాక్సెస్ చేయగలగడం దీని విజయానికి కారణమని చెప్పాలి. క్లాస్ టీచర్ల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్‌ను విపరీతంగా వాడారు. అయితే జూమ్ యాప్‌లో మన కాల్స్ టైమ్‌లో హ్యాకర్లు చొరబడి మన ఇన్ఫర్మేషన్ దొంగిలిస్తున్నారని గుర్తించారు. దీనికి జూమ్‌బాంబింగ్ అని కూడా పేరు పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే తమ అధికారులు, మంత్రులు ఎవరూ ఈ యాప్ వాడొద్దని ఆర్డర్స్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జూమ్ యాప్‌ను మీ సేఫ్టీ దెబ్బతినకుండా వాడుకోవడానికి టిప్స్ చెప్పారు జూమ్ ఇండియా హెడ్, జనరల్ మేనేజర్ సమీర్ రాజే. ఆ టిప్స్ మీకోసం..
1. పర్సనల్ మీటింగ్ ఐడీలను షేర్ చేయకండి
మీ పర్సనల్ మీటింగ్ ఐడీలను ఎవరికీ షేర్ చేయకండి. మీరు మీటింగ్ సెట్ చేయాలనుకున్నప్పుడు ర్యాండమ్ జనరేటెడ్ మీటింగ్ ఐడీలనే వాడండి.
2. స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోండి
స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. తరచుగా పాస్వర్డ్లు మార్చుతుండండి. ఈజీగా తెలిసే యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు వాడొద్దు. అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, కంపెనీ పేరు, ఫ్యామిలీ మెంబర్ల పేర్లు వంటివి వచ్చేలా పాస్వర్డ్లు అసలు వాడొద్దు.
3. సోషల్ మీడియాపట్ల మరింత జాగ్రత్తగా ఉండండి
మీరు మీ జూమ్ మీటింగ్ గురించి సోషల్ మీఇయాలో షేర్ చేయాల్సిన అవసరం ఉందా. సాధారణంగా అలా చేయొద్దు. కానీ మీకు తప్పదనుకుంటే మీ ఐడీ, పాస్వర్డ్లు పొరపాటున కూడా సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. అదే జరిగితే మీరు దొంగకు మీ ఇంటి అడ్రస్ చెప్పి, తాళం చేతికిచ్చినట్లే.
4.వెయిటింగ్ రూమ్స్ వాడుకోండి
జూమ్‌లో వెయిటింగ్ రూమ్ అనే మంచి సెక్యూరిటీ ఫీచర్ ఉంది. జూమ్ 5.0 అప్డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. డిఫాల్ట్ ఫీచర్‌గా వచ్చే వెయిటింగ్ రూమ్ పీచర్‌ను వాడుకోవడం ద్వారా అన్వాంటెడ్ పార్టిసిపెంట్స్ కాల్లోకి రాకుండా కంట్రోల్ చేయొచ్చు.
zoom zoom tips and tricks zoom meetings zoombombing జూమౠసేఫà±à°Ÿà±€ à°Ÿà°¿à°ªà±à°¸à±â€Œ జూమౠసేఫà±à°Ÿà±€ గైడà±â€Œ సేఫౠజూమింగà±â€Œ జూమà±â€Œà°¬à°¾à°‚బింగà±â€Œ