ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. వారి కొసం కొత్త యాప్ జియో గ్రూప్ టాక్ ను తీసుకొస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ట్రయల్ వెర్షన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా గ్రూపు కాలింగ్ లేదా గ్రూపు టాక్ అవకాశాన్ని కల్పించనుంది. ఒకేసారి పదిమంది వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారిని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం, మ్యూట్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. లెక్చర్ మోడ్ తదితర ఫీచర్లు కొత్త యాప్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ట్రయల్ మోడ్‌లో ఉన్న యాప్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో పేర్కొంది.
జియో సిమ్ ఉన్న ఫోన్లలో హెచ్‌డీ వాయిస్ కాలింగ్ సపోర్ట్ చేసే డివైజ్‌లలో ఈ యాప్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌ను రూపొందించారు. ట్రయల్ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. జియో నంబర్ ఉన్న యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
''జియో టాక్ యాప్: వన్ టచ్ మల్టీ పార్టీ కాలింగ్ అప్లికేషన్'' పేరుతో జియో యూజర్ల కోసం డెవలప్ చేసింది. ఒక యూజర్ ఒకేసారి 10 మందితో కాన్ఫరెన్స్ కాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాయిస్ కాలింగ్ చేసుకునేలా రూపొందిస్తున్నారు.ఇందులో లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ లాంటి ఇతర ఫీచర్లను కూడా జోడించింది. ప్రస్తుతం పరీక్షల్లో ఉన్న ఈ యాప్‌ను అతి త్వరలోనే జియో కస్టమర్లకు అందించనుంది.
జియో à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ టెలికాం రిలయనà±à°¸à± జియో à°®à±à°–ేషౠఅంబానీ