అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్లు వాడుతున్న వారికి నిజంగా ఇది చేదు లాంటి వార్తే. ఆ ఫోన్లలోని సమాచారాన్ని చోరీ చేస్తున్నారనే వాస్తవాలు ఇప్పుడు పటిష్టమైన ఆపిల్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ముఖ బ్యాంకింగ్, ఫైనాన్స్, హోటల్, ట్రావెల్ బుకింగ్ యాప్స్ యూజర్లకు చెందిన సమాచారాన్ని చోరీ చేస్తున్నాయని వాస్తవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా మారాయి. ఈ యాప్స్‌ను యూజర్లు వాడేటప్పుడు స్క్రీన్‌పై చేసే గెస్చర్లు, ఫాంలలో ఎంటర్ చేసే సమాచారం, లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు.. తదితర సమాచారం అంతా ఆయా యాప్స్ డెవలపర్లకు వెళ్తుందట. యూజర్లు ఆ యాప్స్‌ను వాడేటప్పుడు ఐఫోన్ స్క్రీన్ రికార్డింగ్ అవుతుందట. దీన్నే సెషన్ రీప్లే అంటారని తెలుస్తోంది.
అయితే ఇలా రికార్డయిన డేటా ఆయా యాప్ డెవలపర్లకు ఫీడ్‌బ్యాక్ రూపంలో వెళ్తుంది. దీంతో వారు యూజర్లకు చెందిన సమాచారాన్ని సులభంగా తెలుసుకుంటారు. అయితే ఇదే విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, చాలా మంది ఆపిల్‌ను విమర్శించడం మొదలు పెట్టారు. ఆపిల్ ఈ విషయంపై స్పందిస్తూ.. సదరు యాప్‌లు స్క్రీన్ రికార్డింగ్‌ను ఆఫ్ చేయకపోతే వెంటనే ఆ యాప్‌లను యాప్‌స్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఐఫోన్ యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ తమకు ముఖ్యమని ఆ సంస్థ తెలియజేసింది. కాగా ఆ యాప్‌లలో Hotels.com, Expedia, Air Canada యాప్‌లు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. యూజర్లు ఈ యాప్‌లను ఐఫోన్ లలో వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్స్ మీ ఐఫోన్లలో ఉంటే వెంటనే వాటిని తొలగించుకోవాలని ఆపిల్ కోరుతోంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ ఆపిలౠà°à°«à±‹à°¨à± యాపà±à°¸à±