రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ సమస్యల గురించి ఎవరికి చెప్పాలో మనకు తెలియదు. కేవలం ట్రయిన్‌కు సంబంధించిన ఇబ్బందులే కాక టీజింగ్, దొంగతనాలు లాంటి సమస్యలు కూడా ఉంటాయి. మరి ఈ సమస్యల గురించి అప్పటికప్పుడు పోలీసులకు చెప్పాలంటే ఎలా? ..దీని గురించి ఎక్కువ ఆందోళన చెందొద్దు.. ఇందుకు కూడా ఒక యాప్ వచ్చింది. ఈ యాప్ సాయంతో మీరు ట్రయిన్‌లో ఉండగానే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు..మరి ఈ యాప్ సంగతేంటో చూద్దామా..
రైల్వే కొత్త సదుపాయం
ఇటీవలే భారతీయ రైల్వే ఒక వెబ్‌సైట్‌తో పాటు ఒక సాహ్ యాత్రి అనే మొబైల్ అప్లికేషన్‌ని లాంచ్ చేసింది. ఈ యాప్‌ని యూజ్ చేసి మీరు నేరుగా క్రిమినల్ కంప్లైంట్స్ కూడా ఇవ్వొచ్చు. దేశంలో ఎక్కడైనా ఎక్కడనుంచైనా ఈ యాప్ పని చేస్తుంది. దీని వల్ల మీరు ప్రత్యేకించి రైల్వే పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం లాంటి సమస్యలు తప్పుతాయి సమయం ఆదా అవుతుంది. ఆన్‌లైన్‌లో ఉండే డేటాబేస్ ఆధారంగా క్రిమినల్స్‌ను గుర్తించి పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు.
ఎలా ఉపయోగపడుతుందంటే..
సాహ్‌యాత్రి అనే యాప్‌ను మీ మొబైల్‌లో ఉంచుకుంటే మీకు రైలు జర్నీలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఈ యాప్‌ను ఓపెన్ చేసి నేరుగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు. దీని వల్ల ఆన్‌లైన్‌లోనే పోలీసులు కంప్లైంట్ స్వీకరించి మీ కేసు అప్పటికప్పుడు దర్యాప్తు చేస్తారు. దీంతో పాటు ఈ యాప్‌లో మిస్సింగ్ పీపులు వివరాలు, క్రిమినల్స్ డిటైల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దీని వల్ల కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని రైల్వే శాఖ చెబుతుంది.
Filing Complaint Inside Trains Railway Stations Becomes Easy New App