నిన్నా మొన్నటివరకు ప్రపంచంలో కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి.. ఇండియాలో లాక్డౌన్తో పరిస్థితి కంట్రోల్లోనే ఉంది అనుకుంటున్న వారికి రెండు రోజులుగా నమోదవుతున్న కేసులు చూసి వణుకు పుడుతోంది. కరోనా వ్యాప్తిని నివారించాలంటే ఆ వ్యాధి సోకిన వారిని గుర్తించి జనం నుంచి ఐసొలేట్ చేయాలి. వారిని ప్రత్యేకంగా పెట్టి అత్యంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ చిక్కంతా ఇక్కడే వస్తోంది. జనం తమంత తాముగా తమకు కరోనా లక్షణాలున్నాయని బయటకు రావట్లేదు. విదేశాల నుంచి వచ్చినవారు లేదా కరోనా అనుమానిత లక్షణాలున్నవారు ఇల్లు కదలకుండా ఉండాలని చెబుతున్నా పట్టించుకోకుండా రోడ్డెక్కేస్తున్నారు. మొన్నా మధ్య నెల్లూరులో ఒక వ్యక్తి కరోనాకు ట్రీట్మెంట్ చేయించుకుని తగ్గాక 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండమని ఇంటికి పంపితే రోడ్లమీదకు వచ్చేశాడు. పోలీసులు అతి కష్టం మీద గుర్తించి హౌస్ అరెస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు జియో ఫెన్సింగే బ్రహ్మాస్త్రంగా పనికొస్తోంది. ఆయా వ్యక్తుల ఇళ్లు, ఆఫీసులు, షాపులను జియో ఫెన్సింగ్ చేస్తున్నారు. వాళ్లు కదిలితే చాలు ట్రాక్ చేసేస్తున్నారు.
మహారాష్ట్ర ముందడుగు
కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో మహారాష్ట్రలో క్వారంటైన్లో ఉన్న కరోనా రోగులను గుర్తించేందుకు మహా కవచ్ పేరిట యాప్ను మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జాతీయ ఆరోగ్య సంస్థ, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్, డిజిటల్ ఇంపాక్ట్ స్క్వేర్ సంస్థలు కలిసి ఈ యాప్ను తయారు చేశాయి. జియో ఫెన్సింగ్ బేస్డ్గా ఈ యాప్ పని చేస్తుంది.
ఎలా పని చేస్తుంది?
* ఈ మహాకవచ్ యాప్ను కేవలం ప్రభుత్వాధికారులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇది దొరకదు.
* కరోనా స్పీడ్గా స్ప్రెడ్అయ్యే అవకాశమున్న ప్రాంతాలు, మార్కెట్లు, రెస్టారెంట్లు, షాపులను మహాకవచ్ యాప్ ద్వారా గుర్తిస్తున్నారు. వీటిని జియో ఫెన్సింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఎవరైనా ఆ జియో ఫెన్స్ దాటి బయటికి వస్తే యాప్లో ఆ కదలిక నమోదవుతుంది. వెంటనే అధికారులు అలర్టవుతున్నారు.
* కరోనా సోకే అవకాశం ఉన్న వారి గుర్తించి ప్రజలు ఆ ప్రాంతంలోకి వెళ్లొద్దంటూ అలర్ట్ చేస్తున్నారు.
* ముఖ్యంగా కరోనా లక్షణాలున్నవారిని, విదేశాల నుంచి వచ్చి 14రోజుల పాటు హోంక్వారంటైన్ లో ఉన్న వారిని ఇల్లు కదలకుండా కంట్రోల్ చేసేందుకు ఈ మహాకవచ్ యాప్ను ఉపయోగిస్తున్నారు.
carona carona patients Carona control Mahakavach app క‌రోనా క‌రోనా వైర‌సà±â€Œ కొవిడà±â€Œ-19 క‌రోనా à°…à°¨à±à°®à°¾à°¨à°¿à°¤à±à°² à°Ÿà±à°°à°¾à°•à°¿à°‚à°—à±â€Œà°•ౠమ‌హాక‌వ‌చౠయాపà±â€Œ