టిక్‌టాక్ లేద‌ని బెంగ‌ప‌డేవారి కోసం ప్ర‌త్యామ్నాయంగా 10 యాప్స్‌

టిక్‌టాక్ ఇండియ‌న్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నంత‌గా మ‌రే యాప్ కూడా ఆకట్టుకోలేద‌న్న‌ది కాద‌న‌లేద‌న్న వాస్త‌వం. అయితే చైనా యాప్స్ బ్యాన్‌లో భాగంగా గ‌వ‌ర్న‌మెంట్ టిక్‌టాక్‌ను కూడా బ్యాన్ చేసింది. అయితే టిక్‌టాక్ లాంటి ఫీచ‌ర్ల‌తో మ‌న‌కు ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి. అందులో ది బెస్ట్ అనుకున్న ఓ 10 యాప్స్ ఇవీ 

1. మిట్రాన్ (Mitron)
ఇది కూడా టిక్‌టాక్ మాదిరిగానే షార్ట్ వీడియోలుండే సోష‌ల్ ఫ్లాట్‌ఫామ్‌.  ప్ర‌స్తుతానికి ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  

2. చింగారి (Chingari)
టిక్‌టాక్ బ్యాన్ త‌ర్వాత బాగా పాపుల‌ర‌యిన యాప్ చింగారీ. ఇందులో కూడా టిక్‌టాక్ మాదిరిగానే షార్ట్ వీడియోలు తీసి షేర్ చేసుకోవ‌చ్చు. అనేక భార‌తీయ భాష‌ల‌ను ఈ యాప్ స‌పోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ రెండు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 

3. రొపోసో (​Ropos) 
ఇది కూడా టిక్‌టాక్ లాంటి యాప్‌.  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల‌కు అందుబాటులో ఉంది. హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, గుజ‌రాతీ, పంజాబీ, మ‌ళ‌యాళీ, మ‌రాఠీ,  బెంగాలీ, ఒడియా, అస్సామీ భాష‌ల‌ను రొపోసో యాప్ స‌పోర్ట్ చేసింది. స్లోమో, టైమ్ ల్యాప్స్ లాంటి బోల్డ‌న్ని వీడియో ఫీచ‌ర్లున్నాయి.

4. హాట్‌షాట్స్ 
మ్యూజిక్ స‌ర్వీస్‌గా బాగా పాపుల‌ర్ అయిన గానా నుంచి వ‌చ్చిన సోష‌ల్ మీడియా యాప్ హాట్‌షాట్స్‌. ఇది కూడా ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల‌కు అందుబాటులో ఉంది. షార్ట్ వీడియోస్‌ను క్రియేట్ చేసి ఈ యాప్‌లో షేర్ చేయొచ్చు.  

5.ఎంఎక్స్ ట‌కాటక్ (​MX TakaTak) 
6. ట్రెల్ (​Trell) 
7. మోజ్ (​Moj) 
8. బోలో ఇండియా (​Bolo Indya) 
9. రిజిల్ (​Rizzle) 
10. లిట్‌లాట్  (​LitLot) 
 

టిక్‌టాక్‌ చింగారీ మిట్రాన్‌ రొపోసో సోష‌ల్ మీడియా యాప్స్‌ TikTok Alternative apps Chingari Mitron Roposo