డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ ఫీచర్ ప్రారంభంలో ఇండోనేషియాకు మాత్రమే పరిమితి ఉంది. కానీ, క్రమంగా బ్రెజిల్, కెనడా, ఇండియా, మెక్సికో, యూఎస్, ఇతర ప్రాంతాలకు పరిమితిని విస్తరించారు.

గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ పరిమితిని నలుగురి నుంచి 8 మంది వరకు పరిమితి పెంచినట్టు ఇంజినీరింగ్ లీడ్ ఆఫ్ గూగుల్ డ్యుయో, ప్రిన్సిపల్ ఇంజినీర్ గూగుల్ జస్టిన్ ఉబెర్టి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కొత్త అప్ డేట్ తో.. డ్యుయో యూజర్లు.. అదనంగా మరో 7 గురు సభ్యులను గ్రూపు వీడియో కాల్స్ కు యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ డ్యుయో యాప్ లేటెస్ట్ అప్ డేట్ ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్ సఫోర్ట్ చేస్తుందని తెలిపారు. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సప్ మెసేంజర్ కు పోటీగా గూగుల్.. డ్యుయో గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ పరిమితిని పెంచింది. వాట్సప్ గ్రూపు వీడియో కాలింగ్ లో ఒక సింగల్ గ్రూపులో నలుగురికి మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
 

న్యూస్ టెక్నాలజీ గూగుల్ గూగుల్ డుయో వీడియో కాలింగ్ గూగుల్ యాప్స్ గూగుల్ ఫీచర్స్