బెంగళూర్ పోలీసులు, డెలివరీ బాయ్స్ మధ్య అనుసంధానకర్త మై గేట్ యాప్

కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి తీసుకొచ్చిన లాక్ డౌన్ అందరి ఉపాధినీ దెబ్బకొట్టింది. ఇక డెలివరీ బాయ్స్ పరిస్థితి మరీ ఘోరం. ఇంట్లో నుంచి బయిటకు రాలేక జనాలు ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. కానీ డెలివరీ బాయ్స్‌కి  వాటిని కస్టమర్‌కి అందించడం లాక్ డౌన్లో ఒక పెద్ద సాహసంగా మారింది . పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో దేశంలో చాలాచోట్ల డెలివరీబాయ్స్ అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని గుర్తించిన కర్ణాటక పోలీసులు ఈకామర్స్ డెలివరీబాయ్స్‌కి పాసులు ఇస్తున్నారు. ఇందుకోసం మై గేట్ యాప్ వాడుతున్నారు.

ఆండ్రాయిడ్ యాప్‌తో
మై గేట్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఎమర్జెన్సీ ట్రావెల్ అండ్ పెర్ఫార్మింగ్ ఎస్సెన్షియల్ సర్వీసెస్ పాస్ కావాలని అప్లై చేయాలి. 

* దీన్ని పోలీసులు పరిశీలించి పాస్ ఇష్యూ చేస్తారు.  

* ఈ -కామర్స్ డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు సాధారణ ప్రజలు కూడా ఈ యాప్ ద్వారా పాస్ అప్లై చేస్కోవచ్చు. 

* పోలీసులు ఈ పాస్ ఇస్తేనే బెంగళూరులో మీరు బయటికి అడుగుపెట్టాలి. లేకపోతే పోలీసులు చర్యలు తీసుకుంటారు.
 
ఇవీ రూల్స్‌
* ఎవ‌రి పేరున పాస్ తీసుకున్నారో వాళ్లే వెళ్లాలి.  ఒక్క వ్య‌క్తికే పాస్ ప‌నికొస్తుంది.

* ఈ పాస్ మీ మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది.  ఆ మొబైల్ నెంబ‌ర్‌కే మీకు ఓ క్యూఆర్ కోడ్ వ‌స్తుంది.  అధికారులు ఆపితే మీరు ఆ క్యూఆర్ కోడ్ చూపించాలి.  అనుమానం వ‌స్తే వాళ్లు దాన్ని స్కాన్ చేసి టెస్ట్ చేస్తారు.  

*  ఏదైనా గ‌వ‌ర్న‌మెంట్ ఫోటో ఐడీ కార్డు కూడా వెంట తీసుకెళ్లాలి. 

* అంతేకాదు ఈ పాస్ కొంత కాలం వాలిడిటీతో వస్తుంది. ఆ టైం దాటాక బయట తిరిగినా చర్యలు తప్పవు.

క‌ర్ణాట‌క స్టేట్ పోలీస్‌ బెంగ‌ళూరు పోలీసుల పాస్‌ మైగేట్ ఆండ్రాయిడ్ యాప్‌ క‌రోనా పాస్‌ ఈకామ‌ర్స్ డెలివ‌రీ బాయ్స్‌ MyGate android app carona pass Bangalore police clear pass  e-commerce delivery boys pass