మీ ఏరియాలో క‌రోనా వైర‌స్ ఉందో లేదో తేల్చే టూల్‌

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  దాదాపు 75 దేశాల్లో ల‌క్ష మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా  ఆందోళనకు గురవుతున్నారు. ఇండియాలోకి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మనవారిలో ఆందోళన మరింత ఎక్కువయ్యింది.  ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మన పరిసరాల్లోకి వచ్చిందో లేదో  తెలుసుకునే టూల్ ఒకటుంది. దాని గురించి తెలుసుకుందాం.

ఏమిటీ టూల్‌? ఎలా ప‌ని చేస్తుంది?
Coronavirus outbreak alert service అని టైపు చేసి గూగుల్లో సెర్చ్ చేయాలి.

* ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ సర్వీసుకు మీరు ఏమైనా స్పాన్స‌ర్ చేయ‌గ‌ల‌రా అని అడుగుతుంది. చేయాల‌నుకుంటే చేయొచ్చు.. లేదా స్కిప్ చేయొచ్చు.

* ఇప్పుడు నెక్స్ట్ పేజీలో సిటీ, ఈమెయిలు అడ్రస్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.

* మీ ప్రాంతంలో ఎవరికైనా కరోనా వైరస్ సోకిందని సమాచారం వస్తే వెంటనే మీ మెయిల్ ఐడీకి ఈ వెబ్ స‌ర్వీస్ అలెర్ట్ పంపిస్తుంది.  దీంతో  మీరు జాగ్రత్త పడొచ్చు.

ఏంటి ఉప‌యోగం?
కరోనా వైరస్ సోకిన రోగి నుంచి చాలా తొందరగా మిగిలిన వారికి  వ్యాపిస్తుంది. అందువల్ల మన పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ ఉందా లేదా తెలుసుకుంటే జాగ్రత్తలు తీస్కుని మనకు  సోకకుండా కాపాడుకోవచ్చు.  వీలైనంత వ‌ర‌కు ఆ ప్రాంతానికి వెళ్ల‌కుండా ఉండ‌టం, అత్య‌వ‌స‌ర‌మ‌తే మాస్కులు వేసుకుని త‌గిన జాగ్ర‌త్త‌లు  తీసుకుని వెళ్ల‌డం లాంటి ప‌నులు చేయొచ్చు.

 

Corona virus alert Coronavirus outbreak కరోనా వైరస్ అలెర్ట్ సర్వీస్ కరోనా వైరస్