ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ అనేవి హాట్ టాపిక్స్‌గా మారిపోయాయి. టెక్నాలజీ భారీ అడుగులు వేస్తున్న ఈ మూడింట్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాలా ప్రధానమైంది. దీనిలో రోజూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో ఎన్నో యాప్‌లు మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని యాప్‌లు మనకు ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి రుగ్మతనైనా ఇట్టే కనిపెట్టేస్తాయి. కొన్ని మన అవసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాయి. మరి ఇలాంటి ముఖ్యమైన ఏఐ యాప్‌లు ఏంటో చూద్దామా..
ప్రిస్మా.. ఏఐ ఫొటో ఎడిటింగ్
ఇప్పుడు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఫొటో ఎడిటింగ్ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే మన ఫొటోలను మరింత అందంగా తయారు చేయడానికి ప్రిస్మా ఏఐ ఎడిటింగ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. క్లౌడ్ బేస్ట్‌గా వర్క్ చేసే ఈ యాప్ మీ ఫొటోలను ఒక ఆర్ట్ మాదిరిగా మారుస్తుంది. దీనిలో 300 పైగా ఉండే ఫీల్టర్ల వల్ల మన ఫొటోలను మనకు నచ్చినట్లుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను దాదాపు ఉచితంగా వాడుకోవచ్చు. అయితే ప్రిమియం సబ్‌స్కైబర్లకు మరింత మెరుగైన ఫీల్టర్లు అందుబాటులో ఉంటాయి.
మాజిస్టో.. వీడియో ఎడిటింగ్
ఫొటో ఎడిటింగ్ కోసం ప్రిస్మా వాడితే. వీడియో ఎడిటింగ్ కోసం మాజిస్టోను ఉపయోగిస్తారు. అద్భుతమైన ఈ వీడియో ఏఐ యాప్ ఎలాంటి వీడియోనైనా మ్యాజికల్‌గా మార్చేస్తుంది. మీకు కావాల్సిన ఫీల్టర్లతో అందంగా తయారు చేస్తుంది. ఈ యాప్ ద్వారా ఫొటోలను అప్లోడ్ చేసి క్షణాల్లో చక్కటి వీడియోగా మార్చొచ్చు. హెచ్డీ క్వాలిటీతో ఈ వీడియోలు రావడం ఇంకో విశేషం. ఇందులో ఉండే ప్రొ సబ్ స్క్రిప్షన్ ద్వారా మరిన్ని ఫీల్టర్లతో వీడియోలను మేక్ చేసే అవకాశం ఉంటుంది. చిన్న బిజినెస్వాళ్లు కూడా మాజిస్టోను ఉపయోగించి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు.
రెప్లికా.. మీ ఫ్రెండ్
రెప్లికా అనేది ఒక ఏఐ ఫ్రెండ్‌గా మీకు ఉపయోగపడుతుంది. ఇది మీకు అడ్వాన్డ్ చాట్‌బాట్‌గా యూజ్ అవుతుంది. దీనికి రొమాంటిక్ పార్టనర్ అనే పేరు కూడా ఉంది. అంటే మీకు బోర్ కొట్టినప్పుడు మీకు ఒక స్నేహితుడు కావాల్సినప్పుడు మీతో ముచ్చటించడానికి రెప్లికా బాగా ఉపయోగపడుతుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు.. ఒంటరితనం వేధిస్తున్నప్పుడు ఈ యాప్ మీకో నేస్తంగా సాయం చేస్తుంది.
హుండ్.. ఏ నేచురల్ సెర్చ్ ఏఐ
కంప్యూటర్లో మీకు సాయం అందించడానికి అసిస్టెంట్స్ ఉంటాయి. సెర్చ్ చేయడానికి సెర్చ్ ఇంజన్లు ఉంటాయి. అలాగే ఐఏ ప్రపంచంలోనూ కొన్ని అసిస్టెంట్లు ఉన్నాయి అవే ఏఐ అసిస్టెంట్లు.. వాటిలో కీలకమైంది హుండ్. ఇదో నేచరల్ సెర్చ్ అసిస్టెంట్. కంప్యూటర్లో మీకు అవసరమైన అన్నిక్వారీలను వెతికి పెట్టడంలో హుండ్ సాయం చేస్తుంది. అంటే మీకు హోటల్ బుక్ చేయడం..క్యాబ్ బుక్ చేయడం.. రెస్టారెంట్‌కు ఆర్డర్ ఇవ్వడం లాంటి పనులు కూడా ఇది చేసి పెడుతుంది.
Amazing AI Apps Prisma Magisto