ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ తప్పనిసరి అయిపోయింది. ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత తప్పని సరి అయిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ వాడకం చాలామందికి వ్యాసనంగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఫోన్ వదలట్లేదు జనం. మరి ఈ ఎడిక్షన్ నుంచి బయటపడేది ఎలా? ఇందుకు టెక్నాలజీ సాయం చేస్తోంది. దీని కోసం ఒక యాప్ వచ్చేసింది దాని పేరే ఫారెస్ట్..
ఏమిటి ఫారెస్ట్
మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటపడేయడానికి కనిపెట్టిన కొత్త యాప్ పేరే ఫారెస్ట్. ఈ యాప్ లో ఒక చెట్టు దాని చుట్టూ ఒక టైమర్ ఉంటుంది. అది వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఉదాహరణకు మీరు ఒక టైమర్ అమర్చుకుంటే ఈ లోపు ఒక చెట్టు గురించి ఈ యాప్ సూచనలు ఇస్తుంది. ఈలోపు మనం మొబైల్ బ్రౌజ్ చేయాలని ప్రయత్నించినా ఏ యాప్ పని చేయదు. మీరు టైమర్ సమయం ఫోన్ యూజ్ చేయాలని భావిస్తే చెట్టును చంపినట్లే అనే ఆలోచన మీకు వస్తుంది. అందుకే ఫోన్ జోలికి వెళ్లకుండా బుద్దిగా వేరే వ్యాపకం మీద మనసు మళ్లుతుంది.
ఎలా వాడాలంటే..
ముందుగా ప్లే స్టోర్ నుంచి ఫారెస్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి ఇది ఇన్ స్టాల్ అయిన తర్వాత ఈ యాప్ ఓవర్ వ్యూ అర్ధం అవుతుంది. ఒక పేజీ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకో గ్రీన్ స్లైడర్ కనిపిస్తుంది. దీంతో మనం టైమర్ సెట్ చేసుకోవాలి. ఒక చెట్టు బొమ్మ మధ్యలో టైమర్ అమర్చి ఉంటుంది. దీనిలో మీరు సమయాన్ని పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. కనీసం 10 నిమిషాలు సమయం ఈ టైమర్లో సెట్ చేసుకోవాలి. టైమ్ సెట్ చేసుకున్న తర్వాత ప్లాంట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి టైమ్ సెట్ చేసుకున్నాక మీరు నాటిన ఆ మొక్కను కిల్ చేయలేరు. దీని వల్ల ఫోకస్ అంతా ఈ చెట్టు మీదే ఉంటుంది. వేరే యాప్ లను యాక్సెస్ చేయలేం. దీని వల్ల ఫోన్ వాడకం కూడా తగ్గిపోతుంది.
ANDROID AP P STAY FOCUSED BEAT PHONE ADDICTION FOREST