ఈరోజుల్లో సినిమాలు చూడటం ఇష్టంలేని వారుంటారా? దాదాపుగా అందరికీ సినిమాలు చూడటం ఇష్టమే ఉంటుంది. కానీ వారి ఆసక్తిని బట్టి...ఇష్టమైన సినిమాను బట్టి చూస్తుంటారు. కొందరికి థియేటర్లకు వెళ్లి చూస్తే...మరికొంత మంది ఇట్లో టీవీల్లో చూస్తుంటారు. ఇంకొందరు ఆన్ లైన్లో చూస్తారు. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు చూస్తుంటారు. అయితే ఇప్పుడంతా ఆన్ లైన్ ట్రెండ్ నడుస్తోంది. ఇంటర్ నెట్ సౌకర్యం ఉన్న ప్రతిఒక్కరూ...తమకు ఇష్టమైన సినిమాను ఆన్ లైన్లో చూస్తున్నారు. దీనికి ఎన్నో రకాల మాధ్యమాలు ఉన్నాయి. అయితే లీగల్ గా సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవడానికి అనుమతించే కొన్ని మంచి సైట్లను మీకోసం ఈ ఆర్టికల్ ద్వారా అందిస్తున్నాం.
Vudu...
ఈ వెబ్ సైట్లో అన్ని కేటగిరిలకు చెందిన సినిమాలు ఉన్నాయి. యాక్షన్, క్రైం సస్పెన్స్, కామెడీ, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, డ్రామా, ఫ్యామిలీ, కిడ్స్, డాక్యుమెంటరీ, హార్రర్ ఇలా వర్గాలుగా విభజించబడి పదుల సంఖ్యలో ఉచిత సినిమాలు ఉన్నాయి. అంతేకాదు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను కూడా చూడవచ్చు.
కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కోసం ఒక పేజీ కూడా ఉంది. అయితే వెబ్ సైట్ కంటెంట్ తో ఎలా అప్ డేట్ అవుతుందో దాన్ని బట్టి చూడవచ్చు. మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఎన్నిసార్లయైనా సినిమాలు చూడొచ్చు.
అంతేకాదు ఈ వెబ్ సైట్ ద్వారా ఫ్రీగా సినిమాలు లోడ్ అవుతుండగా...సినిమాలను రెంట్ కు కూడా తీసుకోవచ్చు. మీ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ ద్వారా ఫ్రీ సినిమాలను చూడొచ్చు. అయితే ఈ సైట్ ద్వారా సినిమాలను చూడాలనుకునే యూజర్లు తప్పనిసరిగా యూజర్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి.
Tubi...
వుడు వలే కాకుండా తుబిలో ప్రతి వీడియోను చూడవచ్చు. సాధారణమైనవే కాకుండా నెట్ ఫిక్స్ లోని చాలా ఇంట్రెస్టింగ్ కేటగిరిలు ఇందులో ఉన్నాయి. కల్ట్ క్లాసిక్స్, ఇండీ ఫిలిమ్స్, మార్షల్ ఆర్ట్స్ , వంటివి చాలా ఉన్నాయి.
ఇది చాలా పాపులర్ పేజీ. యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోకుండానే...ఈ సైట్ ను ఓపెన్ చేయవచ్చు. మీకు మూవీ స్ట్రీమింగ్ అవసరం అయినట్లయితే ఇది బెస్ట్ సైట్.
కొత్త సినిమాలు, ఇటీవల విడుదలైన సినిమాలకు సంబంధించిన ఈ పేజీలో ఈ మూవీ స్ట్రీమింగ్ సైట్లో కొన్ని ప్రత్యేకమైన విభాగాలు ఉన్నాయి.
The Roku Channel...
ఇది సాధారణ స్ట్రిమింగ్ డివైజుగా మాత్రమే చూపిస్తుంది. రోకూ ఛానెల్ నుంచి ఫ్రీగా సినిమాలు చూడవచ్చు. ఒక సినిమాను సెలక్ట్ చేసుకుని..మీ యూజర్ అకౌంట్ లాగిన్ కావాల్సి ఉంటుంది.
టైటిల్ తో సినిమాను సెర్చ్ చేయడానికి ఒక బార్ కూడా ఉంది. ఫీచర్డ్, కొత్తగా రిలీజ్ అయినవి, నేచర్, జంతువులు, ఫ్యామిలీ, రియాలిటీ వంటి విభాగాల ద్వారా బ్రౌజ్ చేయవచ్చు. అంతేకాదు ఫ్రీగా టీవీ ప్రోగ్రామ్స్, లైవ్ టీవీ స్ట్రీమింగ్ కూడా ఉంది.
ఇక రోకు ఛానెల్ ఒక కంప్యూటర్ లో మాత్రమే పనిచేస్తుంది. మొబైల్ డివైజుల కోసం రోక్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలి.
Sony Crackle...
సోనీ క్రాకెల్...దీన్ని మీరు తప్పనిసరిగా ఇష్టపడే ఫ్రీ మూవీ స్ట్రీమింగ్ సైట్. యాక్షన్, కామెడీ, డ్రామా, థ్రిల్లర్ వంటి సినిమాలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసిన లిస్టును కూడా ఉంటుంది.
ఇందులో పాతసినిమాలు టన్నుల కొద్దీ ఉంటాయి. ప్రతి మూవీ పేజీలో తారాగణం, సభ్యుల జాబితా, నిర్మాతలు, రచయితలకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
ఫ్రీసినిమాలను టోటల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకుని చూడవచ్చు. మీ కంప్యూటర్, టాబ్లెట్, ఫోన్ నుంచి కూడా చూడొచ్చు. ఈ సైట్ ద్వారా ఫ్రీ సినిమాలు చూడటానికి యూజర్ అకౌంట్ అవసరం లేదు.
Popcornflix...
పాప్ కార్న్ ఫ్లిక్స్ లో ఫ్రీ సినిమాలు కొన్ని వర్గాలుగా విభజించబడి ఉన్నాయి. స్టాఫ్ పిట్స్, పాప్ కార్ని ఫ్లిక్స్, ఒరిజినల్స్, ఓల్డ్ స్కూల్ కూల్, డేటా నైట్ వంటి ఎంటర్ టైన్ మెంట్ విభాగాలలో విభజించబడి ఉన్నాయి. కానీ స్టైలీష్ కామెడీ సినిమాలు, ఆసియా యాక్షన్ సినిమాలు , డాక్యుమెంటరీలు, ఫారిన్ సినిమాలు, డ్రామా, యాక్షన్ వంటి సినిమాలు ఉన్నాయి.
ఉచిత సినిమాలౠలీగలౠవెబౠసైటà±à°²à± free movies legal web sites