ఆరోగ్య‌సేతు యాప్ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవ‌డం సేఫ్ కాదా.. నిజానిజాల‌పై విశ్లేష‌ణ‌

మీకు స‌మీపంలో క‌రోనా రోగి ఉంటే మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేసే ఓ విశిష్ట‌మైన ఫీచ‌ర్‌తో వచ్చింది ఆరోగ్య‌సేతు యాప్. ఇది కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్‌పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డానికి త‌యారుచేయించిన యాప్.  ఏకంగా 13 రోజుల్లో 5 కోట్ల‌కు పైగా డౌన్‌లోడ్స్‌తో  దూసుకుపోతుంది. అయితే ఈ యాప్‌లో డేటాను ప్ర‌భుత్వం వేర్వేరు ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంటుంద‌నే రూమ‌ర్లు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వ‌స్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఈ యాప్ మ‌న నుంచి సేకరించే డేటాను ఎంత భ‌ద్రంగా ఉంచుతుంది?  నిజంగానే ఇది మ‌న సెన్సిటివ్ డేటాకు ప్ర‌మాద‌క‌ర‌మా అనే అంశంపై నిశిత విశ్లేష‌ణ‌. 

ఏయే ఇన్ఫ‌ర్మేష‌న్ తీసుకుంటుందంటే?
ఆరోగ్య‌సేతు యాప్  లొకేష‌న్ ట్రాకింగ్‌, బ్లూటూత్ లో ఎన‌ర్జీ బీకాన్స్‌ను యూజ్ చేసుకుంటుంది. 

* వీటిద్వారా మీ డివైస్ యొక్క మ్యాక్ అడ్ర‌స్‌, మీకు ప‌క్క‌నున్న డివైస్‌కు మ‌ధ్య దూరం, డివైస్ ఐడీ, జీపీఎస్ కోఆర్డినేట్స్‌, సిగ్న‌ల్ స్ట్రెంగ్త్, ఏటైమ్‌కు ఎక్క‌డ‌కు మూవ్ అయ్యారు, బ్లూటూత్ మోడ‌ల్‌, పేరు అన్ని వివ‌రాలు స్టోర‌యి ఉంటాయి.  

* మీ ఆరోగ్య స్థితిగ‌తులు, మీ పేరు, మొబైల్ నెంబ‌ర్‌, మెయిల్ ఐడీ, బ‌ర్త్ ఇయ‌ర్ ఇలాంటి ఇన్ఫో అంతా ఈ యాప్ సేక‌రిస్తుంది.
 

ఇవీ అపోహ‌లు
ఇంత ఇన్ఫ‌ర్మేష‌న్‌ను ప్ర‌భుత్వం సేక‌రిస్తుంది కాబ‌ట్టి దాన్ని క‌రోనా నియంత్ర‌ణ‌లోనే కాదు ఇంకా ఇత‌ర అవ‌స‌రాల‌కు కూడా వాడుకుంటుంద‌ని సోష‌ల్ మీడియాలో కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాక ఈ ఇన్ఫో అంతా గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వ‌ర్ల‌లో స్టోర్ అవుతుంది కాబ‌ట్టి ఎప్ప‌టికైనా మ‌న డేటా గ‌వ‌ర్న‌మెంట్ చేతిలో ఉన్న‌ట్లే అని మ‌రికొంద‌రు అనుమానిస్తున్నారు

డోంట్ వ‌ర్రీ.. బీహ్యాపీ
ఆరోగ్య‌సేతు యాప్‌ను కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ కింద ప‌ని చేసే  నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్ త‌యారు చేసింది. కాబ‌ట్టి సెక్యూరిటీ గురించి ఎలాంటి చింతా అవస‌రం లేదు. నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పేశారు. సెక్యూరిటీ ప‌రంగా చూసుకుంటే ఈ యాప్‌కు తిరుగులేదన్నారు.

* ఈ యాప్ ద్వారా మీ నుంచి సేక‌రించే డేటా మొబైల్‌లో 30 రోజులు మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. మీరు క‌రోనా రిస్క్ లేక‌పోతే మీరు గ్రీన్ జోన్‌లో ఉన్న‌ట్లు. అలాంటప్పుడు మీ డేటా గవ‌ర్న‌మెంట్ స‌ర్వ‌ర్‌లో 45 రోజులు ఉంటుంది. ఒక‌వేళ మీరు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన రిస్క్ ఉన్న‌వారైనా మీ డేటా గ‌వర్న‌మెంట్ స‌ర్వ‌ర్‌లో 60 రోజులకు మించి ఉండ‌ద‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. 

Aarogyasethu app Carona virus tracking app Niti Aayog Aarogya Setu Aarogya Setu app Aarogya Setu security issues ఆరోగ్య‌సేతు యాప్‌ క‌రోనా ట్రాకింగ్ యాప్‌ Â