జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ : ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం మీకోసం

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి దూసుకొస్తోంది. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో అధినేత ముకేష్ అంబానీ జియో బ్రాడ్ బ్యాండ్ తో పాటు మరికొన్ని గాడ్జెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంట్లో జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ కూడా ఉంది. మరి జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ అంటే ఏమిటి ? ఇప్పటిదాకా జియో పోస్ట్‌పెయిడ్ సర్వీస్ గురించి అలాగే ఫ్రీ పెయిడ్ సర్వీసు గురించి విన్నాం.. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ గురించి వినలేదు కదా.. అయితే అదేంటో చూద్దాం. 

జియో ఫైబర్ యూజర్ల కోసం ప్రత్యేకంగా జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ను కంపెనీ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి ప్లాటినమ్ గ్రేడ్ సర్వీసులు లభిస్తాయి జియోఫైబర్ సేవల్ని ఉపయోగిస్తున్నవారికే 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' సర్వీస్ లభిస్తుంది. జియోఫైబర్ తీసుకున్నవాళ్లు 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' కూడా  తీసుకోవాలి అనుకుంటే జియో సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి సిమ్ సెటప్ చేస్తారు. 

ఇందుకోసం మీరు ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' సర్వీస్‌ను మీ డివైజులు అన్నింటికీ వాడుకోవచ్చు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి వస్తుంది. అయితే దీనికి సంబంధించిన టారిఫ్ వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో టారిఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. 

 ఒక 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' కనెక్షన్ తీసుకుంటే అందులోని 4జీ డేటాను కుటుంబ సభ్యులకు కూడా పంచుకోవచ్చు. ఎవరికి ఎంత డేటా షేర్ చేయాలో అంత షేర్ చేయొచ్చు. డేటాను సమర్థవంతంగా, పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంతో పాటు 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' యూజర్లకు ఇంటర్నేషనల్ రోమింగ్ తక్కువ ధరకే లభిస్తుంది. మిగతా జియో సబ్‌స్క్రైబర్లకు ఉన్న ఛార్జీల కన్నా 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' యూజర్లకు ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇక మీ ఇంటి కోసం తీసుకునే ఇంటర్నెట్ కనెక్షన్, టీవీ బిల్, మొబైల్ బిల్ ఇలాంటివన్నీ వేర్వేరుగా లేకుండా మొత్తం ఒకే ప్యాకేజీలో లభిస్తుంది.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ రిలయన్స్ జియో ముకేష్ అంబానీ జియో బ్రాడ్ బ్యాండ్ జియో గిగా ఫైబర్ జియో పోస్ట్‌పెయిడ్ సర్వీస్