సెల్‌ఫోన్ల విప్లవం వచ్చిన కొత్తలో ఫోల్డబుల్ ఫోన్లు ఉండేవి... సోని, శాంసంగ్ లాంటి కంపెనీలు ఈ ఫోల్డబుల్ ఫోన్లు ఎక్కువగా తయారు చేసేవి. ఇవి సైజులో చిన్నవిగా ఉండి వాడటానికి సులభంగా ఉండేవి. అయితే పెద్ద ఫోన్లు, పెద్ద స్క్రీన్లు రావడంతో ఈ ఫోల్డబుల్ ఫోన్లు మరుగునపడిపోయాయి. అయితే ఇటీవల కాలంలో మళ్లీ ఫోన్లు ఫోల్డబుల్‌గా వస్తున్నాయి. మరి ఇలా ఫోల్డబుల్ ఫోన్లు తిరిగి మార్కెట్లోకి రావడానికి ఏంటి కారణం?
సెల్‌ఫోన్ అమ్మకాల్లో చాలా కాలంగా శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా గెలాక్సీ సిరీస్‌లో శాంసంగ్ విజయవంతమైంది. ముఖ్యంగా భారత్‌లో ఈ కంపెనీ అమ్మకాలు చాలా ఎక్కువ. అయితే తన ఫోన్లకు ఇంకా భిన్నంగా చేయడానికి శాంసంగ్ ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. దీనిలో భాగంగా ఆ సంస్థ మళ్లీ ఫోల్డింగ్ ఫోన్లను మార్కెట్లో్కి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తోంది. శాంసంగ్ తాజాగా కొత్త ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఓపెన్ చేసింది. బెండ్ చేయడానికి సులభంగా ఉండేలా తయారు చేసిన ఈ ఫోన్లు 4.58 అంగుళాల పొడవు ఉన్నాయి. కేవలం ఫోన్లు మాత్రమే కాదు ట్యాబ్లెట్లు కూడా శాంసంగ్ తయారు చేసింది. ఇది 7.3 అంగుళాల పొడవు ఉన్నాయి.
గూగుల్ కూడా..
ఫోన్ల తయారీలో తనదైన శైలిలో ఉన్న గూగుల్ కూడా ఫోల్డబుల్ ఫోన్లను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. శాంసంగ్ ప్రకటనకు ముందే గూగుల్ తాను ఫోల్డబుల్ ఫోన్లపై దృష్టి పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ కొత్త ఫోన్లలో డెవలపర్ టూల్స్‌ను కూడా ఇన్‌క్లూడ్ చేస్తున్నట్లు ఇంటర్నెట్ దిగ్గజం పేర్కొంది. ఈ ఫోన్లను మొదట ఫోల్డబుల్‌గా వాడుకొని కావాలంటే ఓపెన్ చేసుకుని ఆపై పెద్ద స్క్రీన్ మీద చూడొచ్చు. రాయలె కంపెనీ సైతం ఫోల్డబుల్ ఫోన్లను తయారీ చేస్తున్నట్లుగా పేర్కొంది. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్లలో ప్రత్యేకత ఏంటంటే ఫోల్డ్ చేసినప్పుడు ఫైన ఒక స్క్రీన్ ఉంటుంది.. ఓపెన్ చేయగానే లోపల ఒక స్క్రీన్ ఉంటుంది. ఫ్లెక్సి పయ్ లాంటి కంపెనీలు 180 డిగ్రీల వరకు ఫోల్డ్ చేసే ఫోన్లు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటన్నిటి లక్ష్యం వినియోగదారులను ఆకట్టుకోవడం... వారికి కొత్త ఫీచర్‌ను అందించామన్న భావన కల్పించడమే. అందులోనూ ఈ తరం వారికి ఫోల్డబుల్ ఫోన్ల గురించి పెద్దగా తెలియదు. ఈ నేపథ్యం రానున్న రోజుల్లో ఫోల్డబుల్ ఫోన్ల హవా నడిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Foldable phones coming Sumsung Nokia Google Trend