ఈ స్కిల్స్ ఉన్న ఫ్రెష‌ర్స్‌కి డ‌బుల్ శాల‌రీ ఇస్తాం అంటున్న ఇన్ఫోసిస్‌

ఇప్పుడు స్కిల్ ఉన్నోడిదే రాజ్యం.. ఉద్యోగాల్లో వారికే అగ్ర‌పీఠం. ఐటీ కంపెనీలు కూడా ఈ విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌ట్లేదు. స్కిల్ ఉన్నవారిని ఎంత డ‌బ్బులిచ్చైనా స‌రే త‌మ సంస్థ‌లో ఉద్యోగం చేయించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. అలాంటి స్కిల్స్‌లోనూ ప్ర‌త్యేక‌మైన స్క్సిల్స్ సాధించేవాళ్లు కొందరు ఉంటారు. అలాంటి వారికి ఎర్ర‌తివాచీ ప‌రుస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఇన్ఫోసిస్ అయితే ఏకంగా డ‌బుల్ శాల‌రీ ఇస్తా అంటోంది. మ‌రి ఏంటా స్కిల్స్ చూద్దామా?

ప్రొగ్రామింగ్ స్కిల్స్‌
ఒక మంచి జాబ్ రావాలంటే కొన్ని స్కిల్స్ త‌ప్ప‌నిస‌రి. అయితే ఔరా అనిపించేలా జాబ్ రావాలంటే మాత్రం కొన్ని ప్రొగ్రామింగ్ స్కిల్ రాక త‌ప్ప‌దు. ఇలాంటి మెరిక‌ల్లాంటి వారి కోస‌మే ఇన్ఫోసిస్ దేశమంతా జ‌ల్లెడ ప‌డుతోంది. ఇంజ‌నీరింగ్ క‌ళాశాలలు, ఐఐటీలు, ఎన్ ఐటీల్లో క్యాంప‌స్ ఇంటర్వ్యూల ద్వారా నిపుణుల‌ను గుర్తించి ఉద్యోగాలు ఇస్తోంది. వీరికి ట్ర‌యినింగ్ ఇచ్చి ప‌వ‌ర్ ప్రొగ్రామ‌ర్ పేరిట డివైజ్ చేస్తుంది. ఈ ప‌వ‌ర్ ప్రొగ్రామ‌ర్ జాబితాలో అప్ప‌టికే ఇన్ఫోసిస్ ఎంప్లాయిస్ కూడా ఉండొచ్చు. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ కొన్ని టెస్టులు పెడుతుంది. ఈ టెస్టుల్లో వారు ఉత్తీర్ణులైతే వారికి డబుల్ శాలరీ ఇస్తుంది. 

డిజిట‌ల్ ట్యాగ్స్‌
ప్రొగ్రామింగ్ స్కిల్స్ కాకుండా ఫ్రెష‌ర్ల‌ను, అనుభ‌వం ఉన్న వాళ్ల‌ను కొత్త డిజిటల్ స్కిల్స్ ఉండేలా చూసుకుంటుంది. వీరికి ప్ర‌త్యేకంగా డిజిట‌ల్ ట్యాగ్స్ ఇస్తోంది. ఇలాంటి వారికి అద‌నంగా బోన‌స్‌, ఇన్‌సెంటివ్స్ ల‌భిస్తాయి. గ‌తేడాది ఇన్ఫోసిస్‌లో 2000 మందికి ఇలాంటి డిజిట‌ల్ ట్యాగ్స్ ల‌భించాయి.  అంతేకాక ఇన్ఫోసిస్ 32 హాట్ స్కిల్స్‌ను గుర్తించింది. ఇందులో ఎక్స్‌ప‌ర్ట్ అయిన ఎంప్లాయిస్‌కు కూడా డిజిటల్ ట్యాగ్ ఇచ్చి అద‌నంగా జీతం, భ‌త్యాలు ఇస్తోంది. టీసీఎస్ కూడా ఫ్రెష‌ర్ల కోసం నేష‌న‌ల్ క్వాలిఫ‌య‌ర్ టెస్టును కండెక్ట్ చేస్తోంది. ఇందులో పాస్ అయిన‌వాళ్ల‌కు డ‌బుల్ శాల‌రీ ల‌భిస్తోంది. 

Infosys Pay Double Salary Freshers Skills