ట్విట‌ర్ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కి వెళ్ల‌క్క‌ర్లేదు.. శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్రం హోమ్,అవును నిజమే

కరోనా వైరస్ ప్ర‌పంచ జీవ‌న‌గ‌తిని మార్చేస్తుంద‌ని మ‌నం ముందు నుంచి చెప్పుకుంటున్నాం క‌దా.. ప్ర‌ధాన మంత్రి నుంచి ముఖ్య‌మంత్రుల వ‌ర‌కూ అంద‌రూ క‌రోనా వైర‌స్ ఇప్పుడ‌ప్పుడే పోయేది కాద‌ని.. దానితో క‌లిసి జీవించడం నేర్చుకోవాల్సిందేన‌ని చెబుతున్నారు. దీనిలో భాగంగా సోష‌ల్ డిస్టెన్సింగ్‌, మాస్క్ ధ‌రించ‌డం, శానిటైజ‌ర్లు, హ్యాండ్‌వాష్‌ల‌తో వ్య‌క్తిగత ప‌రిశుభ్ర‌త పాటించ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారాయి. మ‌రోవైపు టెక్నాల‌జీ రంగంలోనూ క‌రోనా పెనుమార్పులు తెస్తోంది.  ఇప్ప‌టివ‌ర‌కు ఐటీ ఉద్యోగుల్లో కొద్ది మందికే ప‌రిమిత‌మైన వ‌ర్క్ ఫ్రం హోం ఇప్పుడు అంద‌రికీ త‌ప్ప‌నిస‌రి అవుతోంది. హైద‌రాబాద్‌లో ఐటీ కంపెనీలు తెరిచి 33% ఉద్యోగుల‌తో న‌డిపించుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం చెప్పినా ఆ రూల్స్ అన్నీ ఆఫీస్‌కి వ‌చ్చే ఎంప్లాయిస్‌తో పాటించ‌డం క‌ష్ట‌సాధ్యం కాబ‌ట్టి వ‌ర్క్ ఫ్రం హోంకే ఓటేస్తున్నాయి కంపెనీలు. తాజాగా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట‌ర్ ఓ సంచ‌ల‌న నిర్న‌యం తీసుకుంది. 

ఇక ఎప్ప‌టికీ వ‌ర్క్ ఫ్రం హోమే
క‌రోనా విజృంభిస్తుండ‌టం, ఇప్పుడ‌ప్పుడే అది కంట్రోల్ అయ్యే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌క‌పోవడంతో  మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్‌ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది. ఇలా ఉద్యోగులంద‌ర్నీ వ‌ర్క్ ఫ్రం హోం చేసుకోవ‌చ్చ‌ని చెప్పిన తొలి సంస్థగా ట్విట‌ర్ రికార్డు సృష్టించింది. 

ఛాయిస్ ఎంప్లాయిస్‌దే 
ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న త‌మ ఉద్యోగుల్లో వ‌ర్క్ ఫ్రం హోం చేసుకునే అవ‌కాశం ఉన్న‌వారంతా ఇక ఎప్ప‌టికీ ఇంటి నుంచే ప‌ని చేయ‌వ‌చ్చ‌ని ట్విట‌ర్ ఈ రోజు ప్ర‌క‌టించింది.  సంస్థ  సీఈవో జాక్ డోర్సే మంగళవారం తమ ఉద్యోగులంద‌రికీ ఈ-మెయిల్‌ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

సెప్టెంబరు వ‌ర‌కు ఆఫీస్‌లు తెరిచే ప‌రిస్థితి క‌నిపించ‌నందున ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, ఆ త‌ర్వాత‌యినా ఆఫీసుకు రావాలా?  వ‌ర్క్ ఫ్రం హోం చేసుకోవాలా అనేది ఉద్యోగులే నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది.  

ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే అసాధార‌ణ‌మైన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్‌ హెచ్‌ ఆర్​ చీఫ్‌ జెన్నిఫర్‌ క్రైస్ట్‌  వెల్లడించారు. 4వేల‌కు మంది పైగా ట్విట‌ర్ ఎంప్లాయిస్‌కు ఇది శుభవార్తే. 
 

ట్విట‌ర్ ఉద్యోగులు ట్విట‌ర్ వ‌ర్క్ ఫ్రం హోమ్‌ Twitter Twitter employees work from home