2019లో త‌ప్ప‌క నేర్చుకోవాల్సిన కీల‌క‌మైన ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు ఇవే

కంప్యూట‌ర్ ప్రొగ్రామింగ్‌... నిరంతరం మారే ప్ర‌క్రియ ఇది. చాలా వేగంగా ప్రొగ్రామింగ్‌లో మార్పులు వ‌స్తుంటాయి. లాంగ్వేజ్‌లు మారిపోతూ ఉంటాయి.  మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు అప్‌డేట్ చేసుకుంటూ కంప్యూట‌ర్ లాంగ్వేజ్‌లు కూడా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఇవి అప్‌డేట్ అయిన ప్ర‌తిసారీ మ‌నం కూడా త‌ప్ప‌ని స‌రిగా మారాల్సి ఉంటుంది. మ‌రి ఈ ఏడాది కూడా అలా మారిన ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు ఉన్నాయి. మ‌రి అలా త‌ప్ప‌కుండా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్‌లు ఏమున్నాయో చూద్దామా..

కోట్‌లిన్‌
ప్ర‌స్తుతం బాగా ట్రెండ్ అవుతున్న లాంగ్వేజ్‌ల‌లో కోట్‌లిన్ ఒక‌టి. ఆండ్రాయిడ్ డివైజ్‌ల‌కు ఇది చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. గూగుల్ దీన్ని మార్క్ చేయ‌డంతో ఇదో ఉత్త‌మ లాంగ్వేజ్‌గా నిలిచింది, ఈ లాంగ్వేజ్ యూజ్ చేయ‌డం వ‌ల్ల ఆండ్రాయిడ్‌లు మ‌రింత ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయ‌ని గూగుల్ చెప్పింది. ఈ లాంగ్వేజ్‌ను నేర్చుకోవ‌డం కూడా చాలా సుల‌భం. 

జావా
జావా గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్న‌వాళ్లు క‌చ్చితంగా నేర్చుకునే ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌ల‌లో ఇదొక‌టి. ఇటీవ‌ల అప్‌డేట్ అయిన జావా క‌చ్చితంగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ అని చెప్పుచ్చు. బిగిన‌ర్స్ ముందుగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్‌ల‌లో ఇదొక‌టి. ఆండ్రాయిడ్‌ల‌కు త‌గ్గ‌ట్టు కూడా దీన్ని డెవ‌ల‌ప్ చేశారు. జావాతో జావా ప్ల‌స్ కూడా అప్‌డేటెడ్‌గా ఉంది. ఇది కూడా క‌చ్చితంగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజే. 

పీహెచ్‌పీ
ప్రొగ్రామ‌ర్ అని పిలిపించుకోవ‌డానికి క‌చ్చితంగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్‌ల‌లో పీహెచ్‌పీ ఒక‌టి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ఎక్కువ‌గా వాడ‌కంలో లేక‌పోయినా దీని ప్రాముఖ్య‌తేమీ త‌గ్గిపోలేదు. చాలా సిస్ట‌మ్స్‌లో స‌గం పీహెచ్‌పీ, స‌గం జావా కోడ్‌ల‌తో ప్రొగ్రామ్‌లు త‌యారువుతున్నాయి. అందుకే ఈ ఏడాది క‌చ్చితంగా నేర్చుకోవాల్సిన ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌ల జాబితాలో ఇది కూడా ఉంటుంది. 

ర‌స్ట్‌
ఎక్కువ‌మంది ఇష్ట‌ప‌డే ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌ల‌లో ర‌స్ట్ ఒక‌టి. స్టాక్ ఓవ‌ర్‌ఫ్లో డెవ‌ల‌ప‌ర్స్ స‌ర్వేలో ఈ విష‌యం తేలింది. మీరు కంప్యూట‌ర్ రంగంలో రాణించాల‌ని అనుకుంటే ముందు ర‌స్ట్ లాంగ్వేజ్‌ను త‌ప్ప‌కుండా ఒంటబ‌ట్టించుకోవాల్సిన అస‌వ‌రం ఉంది. మొజిల్లా ఈ లాంగ్వేజ్‌ను డెవ‌ల‌ప్ చేసింది.  ఇటీవ‌ల అప్‌డేట్ అయిన ఈ లాంగ్వేజ్ మ‌రింత ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంద‌ని కంప్యూట‌ర్ నిపుణులు అంటున్నారు. 

సీ#
ప్ర‌స్తుతం లీడింగ్‌లో ఉన్న ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌ల‌లో సీ# ఒక‌టి.  మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన ఈ లాంగ్వేజ్‌ను నేర్చుకోవ‌డానికి యువ‌త చాలా ఉత్సాహం చూపిస్తోంది. .నెట్ ఫ్లాట్‌ఫాం ద్వారా దీన్ని ఉప‌యోగించొచ్చు. ఫ్రేమ్‌వ‌ర్క్‌.నెట్‌కు ఇది ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌గా ఉంది. ప్ర‌స్తుతం అన్ని ర‌కాల వీడియో గేమ్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో సీ#  లాంగ్వేజ్‌ని ఉప‌యోగిస్తున్నారు. ఇవి కాక ఫైతాన్‌, సీ ప్ల‌స్ ప్ల‌స్‌, గో, స్విప్ట్ ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్‌లు కూడా మ‌నం నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్‌ల‌లో ముందు వ‌రుస‌లో ఉంటాయి. 

Programming Languages Learn 2019 Java C# C rust