ఇన్ స్టాగ్రాంలో బ్లాక్ మెయిల్ జరుగుతున్న విధానంలో ఇది ఒకటి

సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని స్నేహం పేరుతో దగ్గరై మోసం చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మోసాలు రకరకాలుగా జరుగుతున్నాయి. తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా 21 ఏళ్ల అమ్మాయి...17ఏళ్ల అబ్బాయితో పరిచయం పెంచుకుంది. మంచి స్నేహితురాలిని నటిస్తూ...ఆ అబ్బాయిని దారుణంగా మోసం చేసింది. 6 లక్షల రూపాయలతో పాటు విలువైన నగలను దోచుకుంది. 
ఇన్ స్టాగ్రామ్ లో ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే మీరు ఏం చేయాలి?
* గత సంవత్సరం ఒక అమ్మాయి ఇన్ స్టాగ్రాంలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది.
* 17ఏళ్ల అబ్బాయితో పరిచయం పెంచుకుని చాటింగ్ పేరుతో రోజు టచ్ లో ఉండేది. 
* మంచి స్నేహితురాలిగా నటిస్తూ...ఆ అబ్బాయితో రోజూ చాటింగ్ చేస్తుండేంది. 
* వీరిద్దరి స్నేహం ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రారంభమైంది. 
* వీరిద్దరు కూడా చాలా క్లోజ్ గా చాటింగ్ చేయడం ప్రారంభించారు. మంచి ఫ్రెండ్ గా నమ్మించడంతో ఆ అబ్బాయి తన నగ్న చిత్రాలతోపాటు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నాడు.
* దీన్నే ఆసరగా తీసుకున్న అమ్మాయి...ఆ అబ్బాయి పేరుతో మరొక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది.  ఆ అకౌంట్లో అతని వ్యక్తిగత వివరాలతోపాటు నూడ్ ఫోటోలను షేర్ చేసింది. 
* అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. 
* పది లక్షలు ఇవ్వకుంటే...నూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగింది. 
* దీంతో ఆ అబ్బాయితో ఇంట్లో నుంచి డబ్బు, విలువైన నగలను దొంగలిస్తూ తన గర్ల్ ఫ్రెండ్ కు ఇచ్చేవాడు. 
* మొత్తం 6.4లక్షల రూపాయలు, 17తులాల వెండి అపహరించాడు. 
*ఇదంతా గమనించిన అబ్బాయి తల్లిదండ్రులు...అతన్ని గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని చెప్పాడు. 
*మీ వ్యక్తిగత సమాచారం చాలా గోప్యంగా ఉండాలి. మీ పర్మిషన్ లేకుండా ఎవరైన ఇమేజ్ లు, వీడియోలు లేదా ఇతర మెసేజ్ లు షేర్ చేయడానికి అనుమతి లేదు. ఇలాంటివి జరుగుతే వెంటనే చర్యలు తీసుకోండి. 
*ఎవరైనా మిమ్మల్ని ఇన్ స్టాగ్రామ్ లో బెదిరింపులకు దిగినట్లయితే...సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. www.cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా మీరు కంప్లెట్ చేయవచ్చు. 
 

ఇన్ స్టాగ్రామ్ బ్లాక్ మెయిల్ instagram block mail