దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే పౌరుల ఫోన్లను కూడా టాప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పది ప్రభుత్వ ఏజెన్సీలకు అనుమతులిచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తోపాటు ఈ 10 సంస్థలు మీ ఫోన్‌ను ట్యాప్ చేసే అవకాశం ఉంది. ఈ నెల 19న లోక్‌సభ సమావేశాల్లో భాగంగా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లను టాప్ చేస్తున్నారని కొందరు సభ్యలు ప్రశ్నించారు దీనికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000లోని సెక్షన్ 69 ప్రకారం దేశ రక్షణ ,సమగ్రత, సార్వభౌమాధికారం కోసం ఏ పౌరుడి చర్యలపైనైనా ప్రభుత్వం నిఘా పెట్టవచ్చని, వాళ్ల ఫోన్ కాల్స్, మెసేజ్‌లను టాప్ చేయొచ్చని చెప్పారు. ఇందుకోసం దేశంలో 10 ప్రభుత్వ ఏజెన్సీలకు ఫోన్లు టాప్ చేసే అధికారం ఇచ్చామన్నారు.
ఆ 10 ఏజెన్సీలు ఇవే..
1.ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)
2. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)
3. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
4.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)
5 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)
6. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ)
7. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)
8. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)
9. డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటిలిజెన్స్ (డీఎస్ఐ)
10. ఢిల్లీ పోలీస్ కమిషనర్
హోం సెక్రటరీ పర్మిషన్ ఇస్తేనే
ఈ 10 ఏజెన్సీలకు మన ఫోన్స్ ట్యాప్ చేయడానికి అధికారం ఇచ్చినా కూడా అవి మన ఫోన్లను ట్యాప్ చేయాలంటే కేంద్ర హోం శాఖ లేదా రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని కిషన్‌రెడ్డి లోక్‌సభలో చెప్పారు. లా అండ్ అర్డర్ నియమ నిబంధనల ప్రకారమే ఎవరిపైనైనా ఇలా గూఢచర్యం జరపాలంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విషయమైతే కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమైతే రాష్ట్ర హోం శాఖ అనుమతి తీసుకోవాలని కిషన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఆ అప్పీల్‌ను హోం శాఖ పరిశీలించి కారణం పక్కాగా ఉందనుకుంటే ఫోన్ ట్యాప్ చేయడానికి అనుమతి ఇస్తుందని చెప్పారు.
ఫోనౠటà±à°¯à°¾à°ªà°¿à°‚à°—à±â€Œ 10 à°ªà±à°°â€Œà°à±à°¤à±à°µ à°à°œà±†à°¨à±à°¸à±€à°²â€Œà°•ౠఫోనౠటà±à°¯à°¾à°ªà°¿à°‚గౠఅధికారం సీబీఠరా డీఆరà±à° à°à°¬à±€ సీబీడీటీ phone tapping CBI ED IB