ఈ 7 పాస్‌పోర్ట్ ఫేక్ యాప్స్‌తో జాగ్రత్త , అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు

విదేశాలకు వెళ్లడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాస్‌పోర్ట్ ఒకటి. విదేశాలకు వెళ్లేందుకు ఈ మధ్య చాలా మంది ఆసక్తి చూపిస్తుండటంతో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. వీరిని ఆసరాగా చేసుకుని అనేక రకాలైన నకిలీ వెబ్‌సైట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామంటూ అనేక ఫేక్ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. అందుకే పౌరులను అప్రమత్తం చేస్తోంది.నకిలీ వెబ్‌సైట్లను నమ్మొద్దని హెచ్చరిస్తోంది.

పాస్‌పోర్ట్ సేవలు పొందడానికి అధికారిక వెబ్‌సైట్‌ మాత్రమే ఉపయోగించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఇందులో భాగంగా నకిలీ వెబ్‌సైట్ల వివరాలను వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ వెబ్‌సైట్లు ఓపెన్ చేయొద్దని, బ్యాంక్ అకౌంట్ వివరాలు వెల్లడించొద్దని హెచ్చరిస్తోంది. ఈ నకిలీ వెబ్‌సైట్లు .org, .in, .com డొమైన్‌తో ఉంటాయి. ప్రభుత్వ వెబ్‌సైట్ మాత్రం .gov.in డొమైన్‌తో ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిన నకిలీ వెబ్‌సైట్లు 
www.indiapassport.org
www.indiapassport.org
www.passport-seva.in
www.online-passportindia.com
www.passportindiaportal.in
www.passport-india.in
www.applypassport.org

ఈ వెబ్‌సైట్ల ద్వారా మీరు పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నిస్తే నిండా మునగాల్సిందే. అందుకే ప్రభుత్వ వెబ్‌సైట్ www.passportindia.gov.in ఉపయోగించుకోవాలి. లేదా mPassport Seva మొబైల్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

న్యూస్ టెక్నాలజీ ఫేక్ యాప్స్ పాస్‌పోర్ట్ యాప్స్