మనం ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా వెంటనే ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేస్తాం. ప్రపంచంలో సమస్త విషయాలు దీనిలో ఉండడంతో అందరూ గూగుల్‌నే ఎక్కువగా నమ్మకుంటుంటారు. అయితే మనం గూగుల్‌లో ఏ విషయాలు సెర్చ్ చేయాలి... ఏ విషయాలు వెతక్కూడదు ఈ విషయాల గురించి మీకో క్లారిటీ ఉందా! అయితే గూగుల్‌లో అస్సలూ సెర్చ్ చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో తెలుసా!
ఆన్లైన్ బ్యాకింగ్ వెబ్సైట్లు
ఆన్లైన్ బ్యాకింగ్ కోసం వెబ్సైట్ల గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం చాలా సాధారణ విషయం. అయితే ఇలా సెర్చ్ చేయడం ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మన బ్యాంకును పోలిన సైట్లు గూగుల్‌లో లెక్కలేనన్ని ఉంటాయి. వీటిలో ఏది క్లిక్ చేసినా మీ పని అయిపోయినట్లే. రాంగ్ యూఆర్ ఎల్‌ను క్లిక్ చేసి మీ బ్యాకింగ్ వివరాలు ఇస్తే మీ డబ్బులు గల్లంతు అవుతాయి.
కస్టమర్‌కేర్ కాంటాక్ట్స్
చాలామందికి కస్టమర్‌కేర్ నంబర్లు తెలియవు. ఇందుకోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలాంటిప్పుడు కూడా హ్యాకర్లు పొంచి ఉండే ప్రమాదం ఉందట. మోసం చేసేవాళ్లు ఇలా బ్యాంకులకు సంబంధించి కాంటాక్ట్ నంబర్లు, మెయిల్ ఐడీలు ఆన్లైన్లో పెడతారు వీటిని మీరు యూజ్ చేస్తే బుట్టలో పడినట్లే.
యాప్స్, సాఫ్ట్వేర్
చాలామంది యాప్‌ల కోసమో లేదా సాఫ్ట్వేర్ల కోసం గూగుల్‌ను వెతుకుతారు. ముఖ్యంగా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ల కోసం వేట ఎక్కువగా ఉంటుంది. ఈ వేటే హ్యాకర్లకు కావాలి. ఇలాంటప్పుడే ఈ సాఫ్ట్వేర్ లింక్‌ల ద్వారా మీ కంప్యూటర్లలోకి వైరస్లు ప్రవేశిస్తాయి. మీకు సంబంధించిన సమాచారం మీకు తెలియకుండానే తస్కరించబడుతుంది. అందుకే ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్ల్డ్ చేసేటప్పుడు అది సరైందో కాదో నిర్ధారించుకోవాలి.
మెడిసన్స్, మెడిసన్ సింటమ్స్
చాలామంది వైద్యానికి సంబంధించిన సెర్చ్ ఎక్కువగా చేస్తుంటారు. ఇలా చేసినప్పుడు అవసరమైన అనుమానించదగ్గ లింక్స్‌ను క్లిక్ చేయద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం మెడికల్ లింక్స్‌లో స్పామ్ ఉన్నట్లు వారు వెల్లడిస్తున్నారు. మెడిసన్ సింటమ్స్ చెక్ చేసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లు చెబుతున్నారు.
Do not search Google fake sites hackers