పోర్న్ చూస్తుండ‌గా రికార్డు చేశామ‌ని ఈమెయిల్ వ‌చ్చిందా.. అయితే ఈ ఆర్టిక‌ల్ మీ కోసమే!

ఆన్‌లైన్‌లో ఉన్నామంటే మ‌నం ప్ర‌మాదానికి చాలా ద‌గ్గ‌ర్లో ఉన్నామ‌నే అర్ధం. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా స్కామ‌ర్ల వ‌ల‌లో ప‌డిపోవ‌డం ఖాయం. అలాంటి స్కామే ఇది. ఎందుకంటే ఆన్‌లైన్లో దొంగ‌లు మ‌న లాంటి వాళ్ల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు మ‌నం త‌ప్పు చేస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి స్కామే ఇది. పోర్న్ సైట్లు చూస్తున్న‌ప్పుడు మేం రికార్డు చేశాం అని మీకు ఈమెయిల్ ఎప్పుడైనా వ‌చ్చిందా? ఇలా వ‌చ్చి డ‌బ్బులు వ‌దిలించుకున్న వాళ్లు కూడా ఉన్నారు మ‌రి ఏంటి ఈ స్కామ్‌.. దీని బారిన ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

ఆ మెయిల్ ఓపెన్ చేస్తే...
ఒక వ్య‌క్తికి ఒక ఈ మెయిల్ వ‌చ్చింది. ఆ మెయిల్ ఓపెన్ చేయ‌గానే అత‌నికి మ‌తిపోయంది. దీనికి కార‌ణం ఈ అకౌంట్ హ్యాక్ అయింద‌ని చెప్ప‌డ‌మే. అన్నిటికంటే షాకింగ్ విష‌యం ఏమిటంటే మీరు పోర్న్ సైట్స్ చేస్తుండ‌గా రికార్డు చేశామ‌ని.. మీ సిస్ట‌మ్ మొత్తం మా చేతుల్లో ఉంద‌ని.. డ‌బ్బులు ఇస్తేనే ఇవ‌న్నీ వ‌దులుతామ‌ని ఆ ఈమెయిల్ సారాంశం. దాదాపు 700 డాల‌ర్ల‌ను బిట్ కాయిన్ల రూపంలో పంపాల‌ని లేక‌పోతే మీ డేటా మొత్తం నాశనం చేస్తామ‌ని హ్యాక‌ర్లు హెచ్చ‌రించారు. అయితే ఇలాంటి మెయిల్స్ నిజ‌మేనా.. మ‌న డేటా మొత్తం దొంగిలించేశారా.. ఇవ‌న్నీ మ‌న‌కి ప్ర‌శ్న‌లుగానే మిగిలిపోతాయి. దీనికి కార‌ణం మనం మ‌న మెయిల్‌లో వ‌చ్చిన పోర్న్ సైట్ల‌కు సంబంధించిన లింక్స్‌ను క్లిక్ చేయ‌డ‌మే. ఈ లింక్ క్లిక్ చేసిన వెంట‌నే మ‌న అకౌంట్ల‌తో స‌హా స‌మాచారం అంతా హ్యాక‌ర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. 

అప‌రిచిత మెయిల్స్‌
ఇలాంటి పున‌రావృతం కాకుండా ఉండాలంటే ముందుగా మ‌నం చేయాల్సింది అప‌రిచిత ఈమెయిల్స్‌ను క్లిక్ చేయ‌క‌పోవ‌డ‌మే. ముఖ్యంగా పోర్న్ పేరిట వ‌చ్చిన లింక్స్‌క్లిక్ చేయకుండా డిలీట్ చేయ‌డం ఇంపార్టెంట్‌. ఇవీ లింక్స్ ఎక్క‌డికెక్క‌డో మ‌న‌ల్ని తీసుకెళ్లి చివ‌ర‌కు మ‌న డేటాకే ఎస‌రు పెడ‌తాయి. అన్నిటికంటే ముఖ్యంగా పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుకోవాలి. విలువైన ఫొటోల‌ను, డేటాను మెయిల్ నుంచి తీసేయ‌డం బెట‌ర్‌. కంప్యూట‌ర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స్కాన్ చేస్తూ ఉండాలి. ఇందుకోసం స్ట్రాంగ్ యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ల‌ను వాడ‌డం ముఖ్యం. 
 

Scam Email Claiming Recorded Watching Porn