వాట్స‌ప్ ద్వారా మ‌న డ‌బ్బు కొట్టేస్తున్న న‌యా స్కాం ఇదే

సైబ‌ర్ నేర‌గాళ్లు తెలివిమీరిపోతున్నారు.  ఎస్ఎంఎస్‌లకు జ‌నం లొంగ‌ట్లేద‌ని, దానిలో  ఫ్రాడ్ లింక్స్ పంపితే ప‌ట్టించుకోవడం మానేశార‌ని గుర్తించారు. అందుకే స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌ను వాట్సాప్ ద్వారా మోసం చేయాలని కొత్త స్కీమ్ మొద‌లుపెట్టారు. అస‌లు వాట్స‌ప్ ద్వారా ఎలా మోసం చేస్తారో తెలుసుకుందాం. 

ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్‌లో పోస్టులు చూసి
ఇల్లు మారేట‌ప్పుడో, కొత్త వ‌స్తువు కొన్న‌ప్పుడో పాత వ‌స్తువును అమ్మేస్తుంటాం. ఇందుకోసం ఇప్పుడు ఓఎల్ఎక్స్‌, క్విక‌ర్, మార్కెట్ ప్లేస్‌లాంటి వాటిని వాడుతున్నారు చాలా మంది. జ‌స్ట్ మీ ద‌గ్గ‌రున్న వ‌స్తువు ఫోటో తీసి, ఎంత‌కు అమ్మాల‌నుకుంటున్నారో వీటిలో పోస్ట్ చేస్తే చాలు. ఆస‌క్తి ఉన్న‌వాళ్లు మిమ్మ‌ల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇదిగో ఇక్క‌డే వాట్స‌ప్ ద్వారా మోసానికి చాలా మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  

వ‌స్తువు కొంటాం.. అకౌంట్ వివ‌రాలివ్వండి
ఇలా మ‌నం పెట్టే వ‌స్తువులు చూసి కాల్ చేస్తున్నామంటూ సైబ‌ర్ క్రిమిన‌ల్స్ మ‌న‌ల్ని ట్రాప్ చేస్తారు. 

* కొద్దిగా ప‌నిలో ఉన్నామ‌ని, మీ బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ ఇస్తే అకౌంట్‌లో అమౌంట్ వేస్తామ‌ని చెబుతారు. ఆ వ‌స్తువు త‌న‌కు కొరియ‌ర్‌లో పంపేస్తే చాలని, లేదంటే రెండు, మూడు రోజుల్లో వ‌చ్చి తీసుకెళ‌తామ‌ని న‌మ్మిస్తారు.  

* మీరు బ్యాంక్ డిటైల్స్ లేదా గూగుల్ పే నెంబ‌ర్ పంపితే వాళ్లు మీకు వెంట‌నే వాట్సాప్‌లో ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు. 

* ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు మీ అకౌంట్లో డ‌బ్బులు ప‌డ‌తాయ‌ని చెబుతారు.  

*  ఈ క్యూఆర్ కోడ్ ఒక ఇంట‌ర్నెట్ లింక్ లాంటిదే. 

* మీరు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మీ అకౌంట్లో నుంచి వాళ్ల‌కు డ‌బ్బులు వెళ్లిపోతాయి.

ఇది గుర్తుంచుకోండి
అంద‌రూ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏమిటంటే మ‌నం ఎవ‌రికైనా మ‌నీ పే చేయాలంటేనే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. రిసీవ్ చేసుకోవాలంటే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయ‌క్క‌ర్లేదు. మీకు మ‌నీ పంపుతున్నాం.. మేమిచ్చే ఈ క్యూఆర్ కోడ్  స్కాన్ చేయండి అని ఎవ‌రు అడిగినా చేయొద్దు. అది ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ ఏదైనా స‌రే..
 

వాట్సాప్ పేమెంట్ స్కామ్‌ వాట్సాప్ స్కాం Whatsapp payment scam Whatsapp scam