యూట్యూబ్ నడిపేవారికి ఇది నిజంగా చాలా అలర్ట్ అయ్యే వార్తే.. ఇకపై యూట్యూబ్ లో ఏది పడితే అది పెట్టడం కుదరదని, అలా చేస్తే ఎటువంటి పర్మిషన్ లేకుండానే బ్లాక్ చేసుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగా 400 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం)పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ 400 పైగా ఛానళ్లను నిషేధించింది.
ముఖ్యంగా యూ ట్యూబ్‌లో పెడోఫిలియా స్కాంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పిల్లల దోపిడీని ప్రోత్సహించే కంటెంట్‌ను, వ్యాఖ్యలను కూడా నిషేధిస్తున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది.
నెస్లే, డిస్నీ,ఎపిక్, మెక్‌డొనాల్డ్ లాంటి టాప్ బ్రాండ్ల ప్రకటనలను తన ప్లాట్‌ఫాంపై నిలిపివేసిన అనంతరం యూట్యూబ్ నాలుగువందలకు పైగా ఛానెళ్లపై నిషేధాన్ని ప్రకటించింది . చిన్నపిల్లలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అశ్లీల వీడియోలు, వాటిపై చెత్త కమెంట్లకు అనుమతినిస్తున్న యూట్యూబ్‌లోని అల్గోరిథంపై గతవారం రెడిటర్ మాట్విల్సన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఇది పోర్నోగ్రఫీకి, చిన్నపిల్లల్లో తీవ్రమైన మానసిక వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించడంతో సంస్థ ఈ దిద్దుబాటు చర్యలకు దిగింది.
ఇకపై ఎవరైనా ఇలాంటి కంటెంట్ పెడితే ఆ ఛానళ్లను బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. కాబట్టి యూట్యూబ్ నడిపే యజమానులు ఈ విషయాలను గుర్తపెట్టుకోవాలని సూచించింది. ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ దీనిపై యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ కూడా అదేబాటలో నడుస్తోంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ యూటà±à°¯à±‚బౠసోషలౠమీడియా