ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్‌ని దొంగిలిస్తున్న ఫేస్‌బుక్, ఎలాగో తెలుసుకోండి

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు ఏదొ ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. డేటా స్కాం మరకలు మాసిపోకముందే ఇప్పుడు మళ్లీ కొత్త మరకలు దానికి అంటుకున్నాయి.1.5 మిల్లియన్ యూజర్ల ఫోన్లలోని కాంటాక్ట్స్ సమాచారాన్ని ఫేస్‌బుక్ దొంగిలించిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ స్కాం జరుగుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.  పూర్తి వివరాల్లోకెళితే..

సోషల్ మీడియా గెయింట్ ఫేస్‌బుక్ యూజర్లను కొత్తగా ఈమెయిల్ పాస్ వర్డ్ వెరిఫై చేసుకోమని అడుగుతోందట. అకౌంట్ లాగిన్ సమయంలో ఈ వెరిఫై వస్తుందట.  ఆ పాప్ అప్ మెసేజ్ లో యూజర్లు పాస్ వర్డ్ ఎంటర్ చేసే సమయంలో మీ పర్మిషన్ లేకుండానే మీ ఫోన్ కాంటాక్ట్స్ ని ఫేస్‌బుక్  ఇంపోర్ట్ చేసుకుంటుందని సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

దీనిపై ఫేస్ బుక్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఇది నిజమేనని 2016 మే నుంచి ఇది జరుగుతూ వస్తోందని ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయని తెలిపారు. అయితే ఈ కాంటాక్ట్స్ ద్వారా ఎటువంటి అక్రమాలకు పాల్పటడం లేదని, సోషల్ మీడియాలో మరింతగా నెట్ వర్క్ విస్తరించుకునే భాగంలోనే ఇది చేశామని దీనికి యూజర్లకు గైడెన్స్ ఇవ్వడానికే ఇది చేశామని చెబుతున్నారు.

కాగా ఈ ఆరోపణలు రావడంతో గత నెల నుంచి  ఫేస్‌బుక్ ఈ మెయిల్ వెరిఫికేషన్ ను ఆపేశామని లాగిన్ అయిన తొలిసారి మాత్రమే ఈ వెరిఫికేషన్ అడుగుతున్నామని ఆయన తెలిపారు. ఫేక్ అకౌంట్లు ఎక్కువవుతున్న తరుణంలో ఇటువంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఆయన అన్నారు.

ఈ విషయాన్ని  ఫేస్‌బుక్ కూడా ధృవీకరించింది. ఈ వెరిఫికేషన్ విధానాన్ని ఆపేశామని యూజర్లు దీనిపై రివ్యూ కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఈ కాంటాక్ట్స్ ని వేరెవరకీ బదిలీ చేయడం లేదని వారికి సోషల్ మీడియాలో మరింతగా నెట్ వర్క్ పెంచుకునేందుకు మాత్రమే తీసుకున్నామని తెలిపింది. సెట్టింగ్ మెనూలోకి వెళ్లి వారే ఈ కాంటాక్ట్స్ షేర్ ఆప్సన్ పై రివ్యూ చేసుకోవచ్చని తెలిపింది.
 

న్యూస్ టెక్నాలజీ సోషల్ మీడియా ఫేస్‌బుక్ ట్విట్టర్