దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ మధ్య ఫేక్ న్యూస్ లు చాలా ఎక్కువైపోయాయి. రాజకీయ నాయకుల మార్ఫింగ్ చిత్రాలు అలాగే డూప్లికేట్ వీడియోలు మార్ఫింగ్ ఫొటోలు, మిమిక్రీ వాయిస్లు వాడేసి ఇష్టా రాజ్యంగా ఫేక్ వీడియోలను తయారుచేస్తున్నారు. వీటిని యూట్యూబ్ లో పెట్టి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి వాటిపై యూట్యూబ్ ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోనుంది.
ఈ ఫేక్ వీడియోలను కనిపెట్టడానికి కొత్తగా అన్ని వీడియోలకు ఫాక్ట్ చెకింగ్ సిస్టం తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఏవైనా వీడియోల్లో అసత్య ప్రచారం, ఫేక్ న్యూస్ ఉంటే... వెంటనే వాటిని ఫేక్ వీడియోలుగా గుర్తించి అలర్ట్ చేస్తుంది. ఈ వీడియోల్లో తప్పుడు సమాచారం ఉంది (prone to misinformation) అనే వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. అంతే కాకుండా ఆ వీడియోలన్నిటింని సెర్చ్ దగ్గర ఓ గ్రూపులో చూపిస్తుంది. అయితే అది ఫేక్ వీడియోనా లేక నిజమైనదా అనేది మాత్రం మనమే తేల్చుకోవాలి.
ఇప్పటికే వివాదాస్పద అంశాలపై అప్లోడ్ అయ్యే వీడియోలను చెక్ చెయ్యడానికి యూట్యూబ్లో ఓ టీమ్ పనిచేస్తుంది. ఈ టీమ్... అనుమానాస్పద వీడియోలను ప్రత్యేక గ్రూపులోకి చేర్చుతుంది. తద్వారా ఆ వీడియోలను చూసేవారు... అవి నిజమో, కాదో ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ ఇండియాలో మాత్రమే అది కూడా ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అమలులోకి వచ్చింది. త్వరలోనే ప్రపంచం అంతటా అమలులోకి రానుంది. ఇండియాలో త్వరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ముందుగా ఈ రూల్ ని ఇండియాలో తీసుకొచ్చారు.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ యూటà±à°¯à±‚బౠసోషలౠమీడియా