ఇక నుంచి ఒక‌టికి మంచి బ్యాంక్ అకౌంట్ ఉండ‌కూడ‌దా? ఏమిటి కొత్త రూల్‌!

భార‌త్‌లో ఇప్పుడు ఎక్కువ‌మందికి ఒక‌టికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉండ‌డం చాలా కామ‌న్ విష‌యం అయిపోయింది. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా లేక‌పోయినా ఏదో ఒక అవ‌స‌రం కోస‌మో.. ఇంకా దేని కోస‌మో.. ఒక ప్రైవేటు,ఒక ప్ర‌భుత్వ అకౌంట్ల‌ను మెయిన్‌టెన్  చేస్తున్నారు జ‌నాలు. అయితే త్వ‌ర‌లోనే బ్యాంక్ అకౌంట్ల విష‌యంలో ఒక కొత్త నిబంధ‌న తేవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒక మ‌నిషికి ఉండాల్సిన అకౌంట్ల‌ను ఈ కొత్త రూల్‌లో నిర్దేశించ‌నుంది. మ‌రి ఎందుకీ కొత్త రూల్‌!

అర్హ‌త ఉండాలి..
భార‌త ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా చ‌ర్చ‌ల్లో బ్యాంక్ అకౌంట్ల సంఖ్య కూడా ఒక‌టిగా ఉంది.  ఈ నిబంధ‌న ప్ర‌కారం ఒక మ‌నిషి తీసుకునే బ్యాంక్ అకౌంట్ల‌ను నియంత్రించాల‌ని నిర్ణయించారు. బ్యాంక్ యూజ‌ర్ల‌లో రెండు ర‌కాల వాళ్లు ఉన్నారు. వీరిలో బిజినెస్ చేసేవాళ్లు. సాధార‌ణ వ్య‌క్తులు. బిజినెస్ చేసుకునే వాళ్ల‌కు ఎక్కువ బ్యాంక్ ఖాతాల అవ‌స‌రం ఉంటుంది. ఎక్కువ పేమెంట్స్ చేయాల్సి రావ‌డం, ఇత‌ర అవ‌సరాల కోసం ఈ అకౌంట్లు మ‌స్ట్ అని చెప్పాలి. అయితే వ్య‌క్తుల‌కు ఒక‌టికి మించి బ్యాంక్ ఖాతాలు ఎందుకు అనే చ‌ర్చ న‌డుస్తోంది. 

అదే కార‌ణ‌మా!
భార‌త్‌లో ఆర్థిక నేరాలు బాగా పెరిగిపోయిన నేప‌థ్యంలో బ్యాంక్ అకౌంట్ల‌ను నియంత్రించ‌డం ద్వారా అడ్డుక‌ట్ట వేయ‌చ్చ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇటీవ‌ల ఘ‌జియాబాద్‌లో ఒక వ్య‌క్తి ద‌గ్గ‌ర 87  అకౌంట్లు ఉండ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. రూ.380 కోట్ల కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ అకౌంట్ల విష‌యంలో నియంత్ర‌ణ అవ‌స‌రమ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇలా బ్యాంక్ ఖాతాలు నియంత్రించ‌డం వ‌ల్ల ఇన్‌కంట్యాక్స్ శాఖ‌కు కూడా ఇబ్బంది త‌గ్గిపోతుంద‌ని కేంద్రం అనుకుంటోంది.

Govt Allow Multiple Bank Accounts rule