పండగ సీజన్.. ఆన్‌లైన్‌లో అమ్మకాలు దుమ్ము లేచిపోతున్నాయి.. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ సైట్లు భారీ ఎత్తు న అమ్మకాలు చేస్తున్నాయి. ఎప్పుడూ లేనట్లుగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. మనం కూడా ఏదో ఒక వస్తువు పర్చేజ్ చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఏ డిస్కౌంట్ మంచిదో.. నమ్మదగిందో మనకు తెలియదు.. కొంతమంది తెలియక చాలా విషయాల్లో మోసపోతూ ఉంటారు. మరి మీరు కొన్ని మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే...
వస్తువులు కొన్న తర్వాత..
మీరు ఆన్‌లైన్‌లో వస్తువులు కొన్న తర్వాత కొన్ని సార్లు ఫీడ్ బ్యాక్ కోసం కాల్స్ వస్తూ ఉంటాయి.. మీరు కొన్న వస్తువుపై పెద్ద గిఫ్ట్ వచ్చిందని... టీవీ, మొబైల్ తగిలాయని కూడా చెబుతారు. వీటిని సొంతం చేసుకోవాలంటే కొంత సొమ్ము పే చేయాల్సి ఉంటుందని వాళ్లు నమ్మబలుకుతారు. ఇవి నమ్మి వివరాలు చెబితే మీరు మోసపోయినట్లే.
పండగ సమయాల్లోనే..
పండగల సమయాల్లోనే ఇ-కామర్స్ సైట్లు ఎక్కువగా ఆఫర్లతో కూడిన సేల్స్ జరపడం మామూలు విషయం. బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ సేల్స్ ఈ కోవకే చెందుతాయి. ఈ సమయంలోనే భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బాక్‌లు ఉంటాయి. అయితే నియమ నిబంధనలు చదకుండా, అవసరం లేకుండా కొనుగోళ్లు చేస్తే నష్టపోవడం ఖాయం.
వాట్సప్ ప్రొడక్ట్, బ్రాండ్ ప్రొమోషన్స్
కొన్నిసార్లు వాట్సప్‌లో మీకు తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. ఫలానా బ్రాండ్ డిస్కౌంట్లు ప్రకటించందని చెబుతుంటాయి. అలాంటి వాటిని క్లిక్ చేస్తే మీరు బుట్టలో పడినట్లే. ఇవి నిజంగా అమేజాన్, ఫ్లిఫ్ కార్ట్, నుంచి వచ్చిన మెసేజ్‌లు కావు. కానీ వాటి పేరుతో వచ్చే చీటింగ్ మెసేజ్‌లు. వీటితో పాటు క్రెడిట్ కార్డ్ కంపెనీల నుంచి కాల్స్ వస్తుంటాయి. పండగ సమయాల్లో మీకు మంచి ఆఫర్ ఇస్తామని చెబుతారు. మన వివరాలు వెల్లడిస్తే మోసాలకు గురయ్యే అవకాశాలున్నాయి.
Ecommerce ATM Frauds Steal Money Festive Season