గూగుల్ పే 2020 స్టాంప్స్‌తో రూ.2020 గెలుచుకోవ‌డంలో ఎంత నిజ‌ముంది?

చాలా వేగంగా దూసుకొచ్చి అంద‌రికీ అల‌వాటైన యాప్‌ల‌లో గూగుల్ పే ఒక‌టి. ప్ర‌తి సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా కాంటెస్ట్‌లు నిర్వ‌హిస్తూ గూగుల్ అంద‌రికి ఇంకా చేరువైంది. ఇటీవ‌ల దీపావ‌ళి స‌మ‌యంలో స్టాంప్‌ల కాంటెస్ట్ పెట్టి ఎక్కువ‌మందిని ఆక‌ర్షించిన గూగుల్.. తాజాగా కొత్త సంవ‌త్స‌రం నేప‌థ్యంలో 2020 కాంటెస్ట్ పెట్టింది. ఈ కాంటెస్ట్ ద్వారా రూ.2020 గెలుచుకోవ‌చ్చ‌ని గూగుల్ చెబుతోంది మ‌రి ఇందులో నిజం ఎంత‌?

ఏమిటీ  స్టాంప్స్‌!
గూగుల్ పే తాజా అప్‌డేట్స్‌లో స్టాంప్స్ ఆప్ష‌ని యాడ్ చేసింది. దీవాళి స్టిక్క‌ర్ల మాదిరిగానే స్టాంప్‌ల‌ను కూడా గూగుల్ పే ప్ర‌వేశ‌పెట్టింది. 5 వేర్వేరు స్టిక్క‌ర్ల‌ను ఒకే చోట చేరిస్తే రూ.251 వ‌స్తుంద‌ని గూగుల్ పే చెప్పింది. అలాగే గూగుల్ పే కొత్త‌గా పెట్టిన 2020 స్టాంప్స్‌లో 7 ప్ర‌త్యేక‌మైన స్టాంప్స్‌ను క‌లెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వాళ్ల‌కు రూ.2020 గెలుచుకోవ‌చ్చ‌నేది గూగుల్ మాట‌. ఈ స్టాంప్‌లు బెలూన్‌, డీజే, స‌న్‌గ్లాసెస్‌, డిస్కో, టోఫీ, సెల్ఫీ, పిజ్జా పేరుతో త‌యారు చేసిన గూగుల్ అంద‌రికి అందుబాటులో ఉంచింది. మ‌న ఎవ‌రికైనా పేమెంట్ పంపినా, లేదా రీఛార్జ్ చేసినా, బిల్ పేమెంట్ చేసినా మ‌న‌కు ఈ స్టాంప్స్ వ‌స్తాయి. కానీ ఒకే ర‌క‌మైన స్టాంప్స్ వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌. భిన్న‌మైన స్టాంప్స్‌ని సేక‌రించ‌గ‌లిగితేనే మ‌న‌కు రూ.2020 డ‌బ్బులు వ‌స్తాయి.

ఎలా క‌లెక్ట్ చేయాలి!

1.ప్ర‌తి యూజ‌ర్ బిజినెస్ లేదా స్పోర్ట్‌, గూగుల్ పే యూజ‌ర్ల‌కు క‌నీసం రూ.98 పే చేయ‌డం ద్వారా

2. బిల్ పేమెంట్స్‌లో క‌నీసం రూ.300 పే చేయ‌డం ద్వారా.. లేదా క‌నీసం రూ.98 మొబైల్ రీఛార్జ్ చేయ‌డం ద్వారా

3. స్నేహితులను ఆహ్వానించ‌డం ద్వారా కూడా స్టాంపులు సంపాదించొచ్చు.

4. రిఫ‌ర‌ల్ కోడ్ ద్వారా తొలి పేమెంట్ చేయ‌డం ద్వారా

5. స్నేహితుల‌కు గిఫ్ట్ రిక్వ‌స్ట్ పంప‌డం ద్వారా

6. ఏ విధ‌మైన ప‌ద్ద‌తులు పాటించైనా స‌రే మీరు క‌నీసం రోజుకు 5 స్టాంప్‌లు సంపాదించొచ్చు. 

Google Pay 2020 Stamps Launched Win Upto Rs 2020 More Rewards