బ్యాంకులు కేవైసీ కోసం మ‌తం అడ‌గ‌డంలో నిజాలేంటి?

బ్యాంకులు ఇక‌మై మీ కేవైసీ (నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్) ఫారంలో మీ మ‌త‌మేంటో కూడా తెలుసుకోబోతున్నాయా?   క‌స్ట‌మ‌ర్ రెలిజియ‌న్ ఏమిటి అనేది చెప్పాలంటూ కేవైసీలో  ఒక కాల‌మ్ పెట్ట‌బోతున్నాయా? ఇదంతా నిజ‌మేనా?  గ‌వ‌ర్న‌మెంట్ ఏమంటోంది?  నిజానిజాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి

ఫెమా యాక్ట్‌లో ఏముంది?
ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్  యాక్ట్ (ఫెమా) త‌న నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించింద‌ని ఎక‌నామిక్ టైమ్స్ పత్రిక ఓ క‌థనం ప్ర‌చురించింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్గ‌నిస్తాన్‌ల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు ఇండియాలో నివ‌సిస్తుంటే వారు లాంగ్‌ట‌ర్మ్ వీసా క‌లిగి ఉంటే బ్యాంక్ అకౌంట్ పొంద‌వ‌చ్చ‌నేది దాని సారాంశం. అంటే ఆయా దేశాల నుంచి వ‌చ్చే ముస్లింల‌కు ఇక్క‌డ బ్యాంక్ అకౌంట్ ఇవ్వ‌ర‌న్న భావం వ‌చ్చేలా ఆ క‌థ‌నం ఉంది..   ఇప్ప‌టికే కొత్త చ‌ట్టాల‌తో దేశంలో అల‌జ‌డి రేగుతున్న ప‌రిస్థితుల్లో బ్యాంక్ కేవైసీలో మ‌తం అడుగుతున్నార‌న్న వార్త కొంత క‌ల‌కలం రేపింది.  
 

అలాంటిదేమీ లేదు:  కొట్టిపారేసిన కేంద్రం
ఎక‌నామిక్స్‌లో టైమ్‌లో క‌థ‌నం రాగానే కేంద్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించింది. అస‌లు అలాంటి ప్ర‌తిపాద‌నేమీ లేద‌ని కొట్టిపారేసింది. విదేశాంగ శాఖ‌లో ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ విభాగం కార్య‌ద‌ర్శి అయిన రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఇవ‌న్నీ నిరాధార‌మైన క‌థ‌నాల‌ని కొట్టిపారేశారు. బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు కేవైసీలో మతం వివ‌రాలు చెప్పాల‌న్న నిబంధ‌నేమీ ఫెమా చ‌ట్టంలో లేద‌ని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయన ట్వీట్ చేశారు. 

ఆర్‌బీఐ రూల్స్‌లోనూ లేదు
బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు కేవైసీ త‌ప్ప‌నిచేసిన ఆర్‌బీఐ కూడా త‌న రూల్స్‌లో ఎక్క‌డా క‌స్ట‌మ‌ర్ మ‌తం గురించి తెలుసుకోవాల‌ని ప్ర‌స్తావించ‌లేదు. క‌స్ట‌మ‌ర్ పేరు, పుట్టిన‌తేదీ, చిరునామా వంటి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి ఆధార్ నెంబ‌ర్ అడుగుతుంది.  అంతే త‌ప్ప ఎక్క‌డా కులం, మ‌తం వంటి వివ‌రాల ప్ర‌స్తావ‌న కేవైసీలో ఉండ‌దు. 
 

బ్యాంకు కేవైసీలో మ‌త ప్ర‌స్తావ‌న‌ ఆర్‌బీఐ రూల్స్‌ ఫెమా చ‌ట్టం Banks Wil Never Ask For Religion In KYC Â