బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో ఇటీవల కాలంలో క్యాబ్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది క్యాబ్ డ్రైవర్లు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్స్‌కు తమ కార్లు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇన్సెంటివ్స్ సరిగా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు వాళ్లు యాప్ నుంచి లాగవుట్ అయిపోయి సొంతంగా బేరాలు కుదుర్చుకుంటున్నారు. దీంతో ఆ నగరాల్లో క్యాబ్స్ అందుబాటులో ఉండటం లేదు.
59 నుండి 8 శాతానికి పడిపోయిన ఇన్సెంటివ్స్
రెడ్ సీర్ అనే కన్సల్టెన్సీ కంపెనీ లెక్కల ప్రకారం మూడేళ్ల క్రితం ఓలా, ఉబెర్ లాంటి కంపెనీలు తమ బుకింగ్ అమౌంట్‌లో 59 శాతాన్ని క్యాబ్ డ్రైవర్లకు ఇన్సెంటివ్‌గా ఇచ్చేవి. దీంతో కొన్ని వేల మంది తమ కార్లను క్యాబ్స్ సర్వీసులో పెట్టేందుకు ముందుకు వచ్చారు. చాలామంది డ్రైవర్లు లోన్లు తీసుకుని కార్లు కొని క్యాబ్స్ నడపడం స్టార్ట్ చేశారు. అయితే రాన్రాను కంపెనీలు డ్రైవర్లకు ఇన్సెంటివ్‌లు తగ్గించేశాయి. దీంతో లోన్లు తీసుకుని కొన్నవారు ఈఎంఐలు కట్టడానికే అష్టకష్టాలు పడుతున్నారు. క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీల్లో ఇండియాలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఓలా, ఉబెర్‌లకు ఆదాయం బాగానే ఉందని డ్రైవర్లు చెబుతున్నారు. 2016లో 10 లక్షల క్యాబ్ రైడ్స్ నమోదయితే 2019లో ఈపాటికే వాటి సంఖ్య 20 లక్షలు దాటేసింది. అంటే మూడేళ్లలో రైడ్స్ రెట్టింపయినా తమ ఇన్సెంటివ్‌లు మాత్రం ఘోరంగా తగ్గించేశారని వాళ్లు గగ్గోలెత్తిపోతున్నారు
18వేల కార్ల సీజ్
ఇన్సెంటివ్‌లు సరిగా లేక లోను తీసుకుని కార్లు కొన్న క్యాబ్ డ్రైవర్లు ఈఎంఐలు సరిగా కట్టలేకపోతున్నారు. గత ఏడాది కాలంలో ఇలాంటివి 18 వేల కార్లను ఫైనాన్స్ కంపెనీలు సీజ్ చేసినట్లు బెంగుళూరు ఉబెర్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తన్వీర్ పాషా చెప్పారు. బెంగళూరు, ముంబయిల్లో ఓలా, ఉబెర్ క్యాబ్స్ సంఖ్య తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన చెబుతున్నారు. ఇలా కార్లు సీజ్ చేసిన డ్రైవర్లు విధిలేని పరిస్థితుల్లో మళ్లీ వేరేవారి దగ్గర డ్రైవింగ్‌కు వెళుతున్నారు.
సొంత బేరాలు తప్పట్లేదు
ఈ పరిస్థితుల్లో డ్రైవర్లు సొంత బేరాలకు దిగుతున్నారు. అంటే తగినన్ని క్యాబ్స్ అందుబాటులో లేక ట్రిప్ క్యాన్సిల్ అయితే ఆ పర్సన్‌ను డ్రైవర్లు నేరుగా సంప్రదిస్తున్నారు. ఆ అమౌంట్ తమకిస్తే తాము ఓలా, ఉబెర్‌లతో సంబంధం లేకుండా తీసుకెళతామని చెబుతున్నారు. కంపెనీ ఇచ్చే ఇన్సెంటివ్‌తో సంబంధం లేకుండా ఫుల్ అమౌంట్ తాము తీసుకుంటున్నారు. కస్టమర్‌కేమీ నష్టం లేదు.. అదీకాక క్యాబ్స్ దొరకడం కష్టంగా ఉండటంతో వాళ్లూ వెంటనే ఓకే అంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఢిల్లీ, నోయిడాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి.
నోయిడాలో ఓ ఓలా బైక్ డ్రైవర్ కస్టమర్‌ను రైడ్ క్యాన్సిల్ చేసుకుని ఆ డబ్బు తనకిస్తే తానే తీసుకెళతానని చెప్పాడు. ఒక బైక్ రైడ్‌కి 20 రూపాయలు ఛార్జీ చేస్తే అందులో ఓలా ఏడు రూపాయలు తీసేసుకుంటుంది. ఇక నాకేం మిగులుతుందని ఆ బైక్ డ్రైవర్ ప్రశ్నించాడు.
Ola Uber crisis ola uber drivers protest సొంత బేరాలౠచేసà±à°¤à±à°¨à±à°¨ ఓలా ఉబరౠడà±à°°à±ˆà°µà°°à±à°²à±