ఆధార్‌తో పాన్ లింక్ చేయలేదా ? ఆగష్టు 31 ఫ్రెష్ డెడ్ లైన్, ఫ్రెష్ గా ప్రాసెస్ మరోసారి మీకోసం

ఆధార్ కార్డుతో  పాన్ కార్డు లింక్ చేశారా, చేయకుంటే వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు చెల్లదు. ఆగస్టు 31 దాటితే ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ చెల్లుబాటు కావు. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన 10అంకెల (అల్ఫాన్యూమరిక్) పాన్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఆగస్టు 31, 2019 ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఈ తేదీ దాటితే ఆధార్ లింక్ కాని సుమారుగా 20 కోట్ల పాన్ కార్డులు చెల్లనవిగా ప్రకటిస్తారు.ఒకసారి ట్యాక్స్ డిపార్ట్ మెంట్ పాన్ కార్డును రద్దు చేస్తే మళ్లీ తిరిగి వాడేందుకు పనికిరాదు. కాగా క్రెడిట్ కార్డు కావాలన్నా.. బ్యాంకుల నుంచి లోన్లు పొందాలన్నా కచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే. పాన్ కార్డు లేకుండా అక్రమంగా లోన్లు, క్రెడిట్ కార్డులు పొందడం వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆదాయ శాఖ భావిస్తోంది. అందుకే ఆధార్, పాన్ కార్డు లింక్ తప్పనిసరి చేసింది. 

ఎవరైతే ఆగస్టు 31 నాటికి ఆధార్, పాన్ కార్డుతో అనుసంధానం చేసుకోరో వారి పాన్ కార్డు సెప్టెంబర్ 1, 2019నుంచి చెల్లుబాటు కాదు. మరి లింక్ ఎలా చేయాలో చూద్దాం. 

ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి INCOME TAX INDIA EFILING అని టైపు చేయండి.ఇది ఆదాయ పన్ను యొక్క సైట్. అక్కడ కనిపించే income tax India Efiling అని దీని క్లిక్ చేయండి మీకు ఇదీ కరెక్ట్ సైట్ అని నమ్మకం లేకపోతే https://www.incometaxindiaefiling.gov.in అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.

లింక్ క్లిక్ చేయగానే మనకు ఆఫిషల్ హోమ్ పేజీ వస్తుంది ఇక్కడ మనకు ఎడమ వైపున link aadhar అని ఆప్షన్ ఉంటుంది దీనిని క్లిక్ చేయండి. 

ఇక్కడ మనకు ఒక ఫారం ఓపెన్ అవుతుంది దీనిలో మనం మన పాన్ కార్డు నంబరు, ఆధార్ కార్డు నంబరు, ఆధార్ కార్డులో ఉన్న లాగా మీ పేరు. అలాగే మీకు ఒక క్యాప్చర్ కోడ్ వస్తుంది అది టైపు చేసి link aadhar అని ఆప్షన్ క్లిక్ చేయాలి.

ఒకవేళ మీరు ముందుగానే ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేసిఉంటే మీకు ఎడమ వైపు పైన click here అని కనిపిస్తుంది దాని క్లిక్ చేస్తే మన స్టేటస్ ని తెలుసుకోవచ్చు.

మీకు మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ ఐపోయింది అని తెలుసుకోవాలి అంటే ముందుగా చెప్పినట్లు click here అని క్లిక్ చేస్తే మీకు మీ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఎంటర్ చేయమని అడుగుతాది.మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత view my Aadhar Status అని ఆప్షన్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తో లింక్ చేయబడుతుంది.

న్యూస్ టెక్నాలజీ ఆధార్ పాన్ కార్డు ఆధార్ లింక్ కేంద్ర ప్రభుత్వం