మనం ఆధార్ నంబర్ ప్రతి డాక్యుమెంట్లోనూ వాడుతున్నాం. ప్రతి అవసరం కోసం ఆధార్ ని బాగా యూజ్ చేస్తున్నాం. అయితే మనం ఏదైనా అదికారిక డాక్యుమెంట్లలో పొరపాటున ఆధార్ నంబర్ తప్పుగా వేస్తే మీ పని అయిపోనట్లే .. ఎందుకూ అంటారా? ఇలా తప్పుడు సమాచారం అందించినందుకు సదురు వ్యక్తులకు ప్రభుత్వం ఏకంగా రూ.10000 జరిమానా వేయబోతోంది.. మరి దాన కథేంటో చూద్దాం..
రూల్ మారింది
ఆధార్ నంబర్ ను ప్రతి డాక్యుమెంట్లోనూ ప్రభుత్వం తప్పని సరి చేస్తోంది. ముఖ్యంగా ఆదాయ పన్నుకు సంబంధించిన వ్యవహారాల్లో ఆధార్ తప్పనిసరి. అయితే ఈ మధ్య చాలామంది ఆధార్ నంబర్ ని తప్పుగా కోట్ చేయడం మామూలు విషయం అయిపోయింది. దీని వల్ల చాలా వ్యవహారాల్లో డబుల్ ఎంట్రీలు కామన్ అయిపోయాయి. పని తీరులో మందగమనం వచ్చేసింది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది ఇకపై ఎవరైనా ఆధార్ నంబర్ తప్పుగా వేస్తే రూ.10000 జరిమానా కట్టాల్సిందేననే రూల్ పాస్ చేసింది.
ఎందుకింత జరిమానా..
ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదార్ పై ఎన్నో కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. ఆదాయ ద్రువీకరణ పత్రాలు సమర్పించేటప్పుడు పాన్ కార్డు బదులు ఆధార్ ఉపయోగించుకోవచ్చని చెప్పిన కేంద్ర మంత్రి రాంగ్ ఆధార్ నంబర్ వేస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఆధార్ వల్ల బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం సులభం అయింది. సిమ్ కార్డు తీసుకోవడం సులభం అయింది. అయితే ఇంత విలువ ఉన్న డాక్యుమెంట్ ను ఎవరైనా మిస్ యూజ్ చేసే అవకాశాలూ లేకపోలేదు. అందుకే రాండమ్ గా ఆధార్ నంబర్ వేసి మిస్ యూజ్ చేేసే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం ఈ జరిమానా రూల్ పెట్టింది. 2019 సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.
Entering Wrong Aadhaar Number Rs 10 000 Penalty Govt