కరోనా దేశ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బ కొట్టినా చైనా నుంచి విదేశీ కంపెనీలు ఇండియా వైపు తరలివస్తాయన్న మార్కెట్ స్పెక్యులేషన్స్ ఆశలు రేపుతున్నాయి. మరోవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ వస్తువుల బదులు స్వదేశీ వస్తువులు వాడాలంటూ చేస్తున్న ప్రచారం కూడా ఫలితాలనిచ్చేలా కనిపిస్తోంది. తాజాగా చైనా నుంచి ఇండియాకు వచ్చే కంపెనీల జాబితాలో తొలి అంకె పడింది. మొబైల్ ఫోన్ కంపెనీ లావా తన ఆర్ అండ్‌డీ, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను చైనా నుంచి ఇండియాకు షిప్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఇండియన్ కంపెనీయే
వాస్తవానికి లావా ఇండియన్ మొబైల్ ఫోన్ కంపెనీయే. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయని చైనాలో ప్లాంట్ పెట్టింది. ఫీచర్ ఫోన్లు, తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు తయారుచేస్తుంది. లావా ఫోన్లలో దాదాపు 33 శాతం అక్కడి నుంచే మెక్సికో, ఆఫ్రికా, దక్షిణాసియా, పశ్చిమాసియా దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తోంది.
5ఏళ్లలో 800 కోట్ల పెట్టుబడి పెడతాం: లావా
తమ విస్తరణలో భాగంగా ఈ ఏడాది 80 కోట్ల రూపాయలను ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని లావా ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో దీన్ని 800 కోట్లకు పెంచుతామని చెప్పింది. దీనివల్ల లావాకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (PLI scheme) కింద ప్రత్యేక ఇన్సెంటివ్‌లను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది.
లావా మొబైలà±à°¸à±â€Œ చైనా à°¨à±à°‚à°šà°¿ ఇండియాకౠLava Mobiles Lava shift from china to India