నెలనెలా రేషన్ అందుకోవాలన్నా.. విద్యార్థులు స్కాలర్‌షిప్ తీసుకోవాలన్నా.. పింఛన్ సొమ్ము అకౌంట్‌లో పడాలన్నా.. సిమ్ కార్డు, బ్యాంక్ అకౌంట్.. ఇలా ప్రతి చిన్న అవసరానికీ కావాల్సింది `ఆధార్ కార్డు`. పుట్టిన పిల్లాడి నుంచి వృద్ధుల వరకూ ఈ కార్డు అత్యంత కీలకంగా మారింది. స్కాలర్‌షిప్‌లు, రూరల్ డెవలప్‌మెంట్, పెన్షన్లు, రేషన్ వంటి విభాగాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ రంగాల్లో ఆధార్ వినియోగం అధికంగా ఉంది. ఆధార్ కార్డు విశ్వసనీయతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. దీని గురించి ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు యూఐడీఏఐ చైర్మన్ జె.సత్యనారాయణ. ఈ కార్డు ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రానికి ఎంత మొత్తం ఆదా అయిందో తెలుసా.. 90,000 వేల కోట్లు!
నంబర్లు ఏం చెబుతున్నాయి?
రోజూ దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది పౌరులు ఆధార్ కార్డును వివిధ అవసరాల నిమిత్తం వినియోగిస్తున్నారు. అలాగే ఆధార్ కార్డుకోసం నమోదైన వారు, తమ వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటున్న వారు పది లక్షల మంది ఉన్నారు. దేశ ప్రజలందరికీ ఆధార్ ఎంత ప్రామాణికంగా మారిపోయిందో ఈ నంబర్లను గమనిస్తే తెలుస్తుందంటున్నారు యూఐడీఏఐ చైర్మన్ జె.సుబ్రహ్మణ్యం. ఇండియన్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలను తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల సుమారు రూ.90 వేల కోట్లు ఆదా అయ్యాయన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఆధార్ నమోదు, వివరాలు అప్‌డేట్ చేయడం, వేలిముద్రలు గుర్తింపు, ఆధార్ సెక్యూరిటీ వంటి అంశాలపై మరింత దృష్టిసారిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం మరింత మెరుగైన బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఆధార్ కార్డు అమలు చేసేందుకు కేంద్రం ఖర్చు చేసేది ఎంతో తెలుసా.. పది వేలకోట్లు లోపే!
సుప్రీం అలా.. కేంద్రం ఇలా..
ఇక ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్.. వర్తించాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల వరకూ మెడికల్ కవరేజ్ ఇస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబం, అందులోని సభ్యులు 2019 మార్చి 31లోగా ఆధార్ నమోదు చేసుకోవాలని ఆరోగ్య శాఖ తెలిపింది. లేనిపక్షంలో ఈ పథకానికి అర్హులు కాదని స్పష్టంచేసింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశమేంటంటే.. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఏ పథకానికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని గతంలో సుప్రీం కోర్టు కొద్ది రోజుల క్రితమే తీర్పునిచ్చింది.
ఆధారౠకారà±à°¡à± కేందà±à°°à°‚ పథకాలౠఆయà±à°·à± à°…à°¨à±à°¸à°‚దానం aadhar card central government ration pension rural development