ప‌బ్‌జీ ఆడుతూ చ‌నిపోయిన ఐదు తాజా సంఘ‌ట‌న‌లు ఏం చెబుతున్నాయి?

పబ్‌జీ.. కుర్ర‌కారుని ఊపేస్తున్న ఆన్‌లైన్ గేమ్ ఇది. ఈ గేమ్ యువ‌త‌కు ఎంత‌గా ప‌ట్టేసిందంటే  ఇది లేకుండా ఉండ‌లేని స్థితికి వ‌చ్చేశారు కొంద‌రు.. చాలామంది ప‌బ్‌జీలో ప‌డి లోక‌మే మ‌ర‌చిపోతున్నారు.. ప‌నులు విడిచిపెట్టి వ‌ర్చువ‌ల్ వ‌ర‌ల్డ్‌లో బ‌తుకుతున్నారు. అయితే అన్నిటికంటే భ‌యంక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఈ గేమ్ ఆడుతూ చ‌నిపోతున్నారు. ఇటీవ‌లే ఐదుగురు చ‌నిపోయారు. మ‌రి ఈ మ‌ర‌ణాలు మ‌న‌కేం చెబుతున్నాయి?

అంతా కుర్రాళ్లే
ప‌బ్‌జీ ఆట‌లో ప‌డి... ఒక‌ర‌మైన మ‌నోవ్య‌థ‌తోనో లేక ప‌రిస‌రాల‌ను మ‌ర్చిపోవ‌డం ద్వారా చాలా మంది చ‌నిపోతున్నారు. యాక్సిడెంట్స్‌లో చ‌నిపోయిన‌వాళ్లే ఎక్కువ‌గా ఉంటున్నారు. తాజాగా గ్వాలియ‌ర్‌లో 20 ఏళ్ల  సౌర‌భ్ యాద‌వ్ ప‌బ్‌జీ ఆడుతూ నీళ్ల బ‌దులు  కెమిక‌ల్ తాగి చ‌నిపోయాడు.  గురుగ్రామ్‌లోనూ ఇదే పరిస్థితి ఒక కుర్రాడికి ఎదురైంది. 18 ఏళ్ల కుర్రాడు త‌న‌కు త‌ల్లిదండ్రులు ప‌బ్‌జీ ఆడే ఫోన్ ఇవ్వ‌నందుకు సుసైడ్ చేసుకున్నాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌బ్‌జీ ఆడుతూ ఒక కుర్రాడు హార్ట్ ఎటాక్‌తో చ‌నిపోయాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేశాడు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా రోజు రోజుకూ పెరిగిపోతూ వ‌స్తోంది. 

ఏంటి ప‌రిష్కారం?
ఇంత‌మంది యూత్‌పై ప్ర‌బావం చూపుతున్న ప‌బ్‌జీ విష‌యంలో ప్ర‌భుత్వం కూడా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌ట్లేదు. గ‌తంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తార‌న్న వార్త‌లు వ‌చ్చినా అవి అమ‌ల్లోకి రాలేదు. అలాగే ప‌బ్‌జీ విష‌యంలోనూ జ‌రుగుతోంది. కానీ చాలామంది యూత్ ఈ ఆట‌లో ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. మీరు ఈ గేమ్‌కు అల‌వాటు ప‌డితే క‌నుక వెంట‌నే  మానుకోవ‌డ‌మే న‌యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప‌బ్‌జీ ఒక ర‌క‌మైన ప్ర‌పంచంలోకి తీసుకెళ్తుంది. కుర్రాళ్ల‌లో అన‌స‌రంగా హింసా ప్ర‌వృత్తిని ప్రేరేపిస్తుంది. ఈ ఆట‌లో ఓడితే ఏదో స‌ర్వం కోల్పోయిన‌ట్లే చేస్తుంది. అందుకే ఈ ఆటకు దూర‌మైతేనే  బెట‌ర్ అంటున్నారు. త‌ల్లిదండ్ర‌లు కూడా త‌మ పిల్ల‌ల‌పై క‌న్నేసి ఉంచాల‌ని చెబుతున్నారు. 15 ఏళ్ల‌లోపు వాళ్ల‌కు ఫోన్ ఇవ్వ‌క‌పోడం, ప‌బ్‌జీ డౌన్‌లోడ్ చేయ‌క‌పోవ‌డం ఉత్త‌మం అనేది నిపుణుల మాట‌. 

20 Year Dies Playing PUBG Tragic Deaths