మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు తప్పని సరి అయిపోయింది. అందులోనూ ఫొటో గుర్తింపు కార్డుకు చాలా విలువ ఉంది. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరాల కోసం మనం గుర్తింపు కార్డుగా ఇస్తుంటాం. అయితే మనం ఇచ్చిన ఈ సమాచారం అంతా ఏమైపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పెద్ద స్కాం నడుస్తుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ నడిచింది.. ఏకంగా రూ65 కోట్ల స్కామ్. అది కూడా ప్రభుత్వానికి తెలిసే ఇది జరగడం ఇంకో విశేషం..
ప్రైవేట్ సంస్థలకు అమ్మి..
మనం ప్రభుత్వ అవసరాల కోసం గుర్తింపు కార్డుగా ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ డేటాను ప్రభుత్వమే అమ్మకుందంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ నిజం.. మన డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన డేటాను 87 ప్రైవేటు కంపెనీలకు 32 ప్రభుత్వ సంస్థలకు అమ్మినట్లు కేంద్ర మంత్రి గడ్కారీ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఈ డేటాను అమ్మడం ద్వారా రూ.65 కోట్లు డబ్బులు సంపాదించినట్లు కూడా మంత్రి ప్రకటించడం విశేషం. రూ.40 కోట్ల విలువైన డేటా సెట్లను రవాణా శాఖ మెయింటెన్ చేస్తుందని దీనిలో డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వెహికల్స్ సమాచారం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఏం చేయలేమా..
ప్రభుత్వ పాలనలో పౌరులకు ఉపయోగపడే పనులు చేయడం మామూలు విషయమే. ఆదాయం కోసం కొంత డేటాను అమ్మితే ఫర్వాలేదు కానీ ఎంతో విలువైన సమాచారాన్ని ప్రైవేటు కంపెనీల చేతిలో పెట్టడమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కొత్త బల్క్ షేరింగ్ పాలసీ ప్రకారం సమాచారాన్ని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉంది. అయితే ప్రైవేటు కంపెనీలు ఈ డేటాను దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఏంటనేదే ప్రశ్న.
Govt Sold Driving License Data Private Companies Earned