టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసిన తర్వాత, సామాన్యుడికి నెలవారీ బిల్లు భారంగా మారింది. కేవలం సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి లేదా పరిమిత అవసరాల కోసం వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం భారతదేశంలో నెలరోజుల వ్యాలిడిటీతో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్‌ను ఏ నెట్వర్క్ అందిస్తోంది? రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) మరియు బీఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న బడ్జెట్ ప్లాన్ల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
డేటా అస్సలు అవసరం లేని వారికి
సిమ్ కార్డ్ కేవలం ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్ కోసం యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్లు సరిపోతాయి. ఇందులో ఎలాంటి డేటా లభించదు.
నెట్వర్క్: వోడాఫోన్ ఐడియా
ధర: రూ. 142
వ్యాలిడిటీ: 28 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్
ఎస్ఎమ్ఎస్: మొత్తం 300 SMSలు
డేటా: లేదు (0 GB)
నెట్వర్క్: రిలయన్స్ జియో
ధర: రూ. 177
వ్యాలిడిటీ: 28 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్
ఎస్ఎమ్ఎస్: మొత్తం 300 SMSలు
డేటా: లేదు (0 GB)
నెట్వర్క్: రిలయన్స్ జియో
ధర: రూ. 147
వ్యాలిడిటీ: 22 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్
ఎస్ఎమ్ఎస్: మొత్తం 300 SMSలు
డేటా: లేదు (0 GB)
నెట్వర్క్: ఎయిర్టెల్
ధర: రూ. 185
వ్యాలిడిటీ: 28 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్
ఎస్ఎమ్ఎస్: మొత్తం 300 SMSలు
డేటా: లేదు (0 GB)
కాల్స్ + బేసిక్ డేటా
కాల్స్‌తో పాటు వాట్సాప్ లేదా యూట్యూబ్ బేసిక్ అవసరాల కోసం కొద్దిగా డేటా కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఛాయిస్.
నెట్వర్క్: జియో
ధర: రూ. 189
వ్యాలిడిటీ: 28 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్
ఎస్ఎమ్ఎస్: మొత్తం 300 SMSలు
డేటా: మొత్తం 2 GB (నెల మొత్తానికి)
నెట్వర్క్: ఎయిర్టెల్
ధర: రూ. 199
వ్యాలిడిటీ: 28 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్
ఎస్ఎమ్ఎస్: రోజుకు 100 SMSలు
డేటా: మొత్తం 2 GB (నెల మొత్తానికి)
నెట్వర్క్: వోడాఫోన్ ఐడియా
ధర: రూ. 199
వ్యాలిడిటీ: 28 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్ లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్
ఎస్ఎమ్ఎస్: రోజుకు 100 SMSలు
డేటా: మొత్తం 2 GB (నెల మొత్తానికి)
అన్నింటికంటే చవక- BSNL ప్లాన్లు
మీ ఏరియాలో BSNL సిగ్నల్ బాగుంటే, ప్రైవేట్ కంపెనీల కంటే చాలా తక్కువ ధరకే ప్లాన్లను పొందవచ్చు.
రూ. 107 ప్లాన్:
వ్యాలిడిటీ: 35 రోజులు
కాల్స్: 200 నిమిషాల ఉచిత టాక్‌టైమ్
ఎస్ఎంఎస్: లభించవు
డేటా: మొత్తం 3GB డేటా (సెకండరీ సిమ్ యాక్టివ్‌గా ఉంచడానికి ఇది దేశంలోనే అత్యంత చవకైన ప్లాన్).
రూ. 199 ప్లాన్:
వ్యాలిడిటీ: 28 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్
ఎస్ఎంఎస్: రోజుకు 100
డేటా: రోజుకు 2GB చొప్పున లభిస్తుంది.
prepaid recharge plans cheapest recharge plan jio prepaid recharge plans airtel prepaid recharge plan cheapest prepaid plan 2026 vi cheapest recharge plans cheapest jio recharge plan jio cheapest recharge plan recharge plans recharge plan jio prepaid recharge best prepaid plans jio new recharge plans airtel prepaid recharge prepaid mobile recharge prepaid recharge update prepaid plans india